32.7 C
Hyderabad
March 29, 2024 11: 07 AM
Slider కరీంనగర్

బీ అలెర్ట్: అద్దె దారుల తో అప్రమత్తంగా ఉండాలి

karimnagar cp alerted owners from tenants

అద్దెదారుల పట యజమానులు అప్రమత్తంగా ఉండాలని ,అద్దెదారులకు సంబంధించిన వివరాలను ఇంటియజమానులకు ఉచితంగా అందజేస్తామని కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి అన్నారు. యజమానులు అద్దెదారులకు సంబంధించిన వివరాలను ఎస్‌యంఎస్‌, వాట్సాప్‌ తమకు పంపితే సత్వరం స్పందించి వారిపై ఉన్న క్రిమినల్ రికార్డ్స్ ను రికార్డ్స్ లో చూసి వారి డాటాను వెంటనే యజమానులకు అందజేస్తామని పేర్కొన్నారు.

కరీంనగర్‌లోని పోచమ్మవాడలో పోలీసులు మంగళవారం నాడు కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు.ఉదయం 5:30గంటల నుండి 7:30గంటల వరకు ప్రతి అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలను చేపట్టారు.అనంతరం కాలనీ వాసులతో ఏర్పాటైన కార్యక్రమంలో పోలీస్‌ కమీషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటి యజమానులు అద్దెదారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అద్దెదారులకు సంబంధించిన ఆధార్‌కార్డ్‌,ఇతర వివరాలను ఎస్‌యంఎస్‌, వాట్సాప్‌ లేదా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లకు వెళ్ళి అందించినా సత్వరం స్పందించి వివరాలను ఉచితంగా అందజేస్తామని, ఈ విషయాన్ని యజమానులు సద్వినియోగంచేసుకోవాలని కోరారు.

అద్దెదారుల వివరాలను అందించినట్లయితే సదరు వ్యక్తులు దేశవ్యాప్తంగా ఏదైనా నేరాలకు పాల్పడి ఉన్నారా?లేదా? విషయాలను నిమిషాల వ్యవధిలో అందజేస్తామని పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఇళ్ళను అద్దెకిచ్చి నట్ల్టయితే సంఘవిద్రోహకర, అసాంఘీక కార్యకలాపాలు, నేరాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శివారు ప్రాంతాల్లోని నివాసులు అనుమానితుల కదలికలు ఉన్నట్లైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. స్మార్ట్‌ఫోన్‌ కలిగిఉన్న ప్రతిపొౌరుడు హాక్‌ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

ఈ యాప్‌లో మహిళల భద్రతకోసం ప్రత్యేక సదుపాయం ఉందని తెలిపారు. ఎలాంటి సంఘటనలు జరిగినా పోలీసులకు హాక్‌ఐ, వాట్సాప్‌ల ద్వారా సమాచారం అందించవచ్చని, సమాచారం అందించేవారిపేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. షీటీం ఆధ్వర్యంలో పోచమ్మవాడ ప్రాంతంలోమహిళలపై జరిగే వివిధ రకాల నేరాలు, నియంత్రణకు పోలీస్‌శాఖ తీసుకుంటున్న చర్యలపై అవగాహన కార్యక్రమం ఎర్పాటు చేయాలని మహిళ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ను ఆదేశించారు.

మద్యంసేవించి వాహనాలను నడుపకూడదని, రోడ్డుభద్రతలో భాగంగా రోడ్డు నియమనిబంధనలు పాటించాలని కోరారు.మరో 25 సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకువచ్చిన కాలనీవానులు కాలనీవాసులు ఇప్పటి వరకు 28 సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. మరో 25 సిసి కెమెరాల ఏర్పాటుకు స్వచ్చందంగా ముందుకువచ్చారు. సిసి కెమెరాల ఏర్పాటుకు స్వచ్చందంగా ముందుకువచ్చిన కాలనీవాసులనుఅభినందించారు.

పనిచేయని సిసి కెమెరాల గురించి సమాచారం అందిస్తే వెంటనే మరమ్మత్తులు చేయిస్తామని చెప్పారు. నిషేదిత పోగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, పోగాకు ఉత్పత్తులను సేవించడం వల్ల కాన్సర్‌వ్యాధి వస్తుందని తెలిపారు,ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 71వాహనాలు, 7,500రూపాయల విలువచేసే నిషేదిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డిసిపి(ఎల్‌అండ్‌ ఓ) ఎస్‌ శ్రీనివాస్‌,ఎసిపిలు డౌక్టర్‌ పి అశోక్‌, మదన్‌లాల్‌, కార్పోరేటర్‌ ఐలేందర్‌యాదవ్‌, మాజీ కార్పోరేటర్‌ సతీష్‌, ఇన్స్‌ పెక్టర్లువిజయ్‌కుమార్‌, దేవారెడ్డి, విజ్ఞాన్‌రావు, దామోదర్‌రెడ్డి, ఆర్‌ఐలు మల్లేశం, జానిమియా, శేఖర్‌, ఎస్‌ఐలు శ్రీనివాస్‌, శ్రీధర్‌, రాములతోపాటుగా వివిధ విభాగాలకు చెందిన 150 మంది పోలీసులు పాల్గొన్నారు.

Related posts

విశ్వ జనీనం

Satyam NEWS

నావికాదళంలో మొదటి మహిళా పైలెట్

Satyam NEWS

[Over-The-Counter] Vitamins To Reduce Blood Sugar Home Remedy For Diabetes Ayurvedic Home Remedies For Diabetes

Bhavani

Leave a Comment