27.7 C
Hyderabad
April 24, 2024 07: 39 AM
Slider కరీంనగర్

కాళేశ్వరం జలాలతో కరీంనగర్ సస్యశ్యామలం

కాళేశ్వరం జలాలతో కరీంనగర్ సస్యాశ్యామలం అయిందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి లో65 లక్షలతో డి 87న కెనాల్ నుండి రాజసముద్రం చెరువు నింపడానికి నిర్మాణానికి భూమి పూజ చేశారు.. నిర్మాణ పనులు 20 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మిషన్ కాకతీయతో చెరువులన్నీ పునరుద్దరణ జరిగిందని, బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయని వెల్లడించారు. సమైక్యాంధ్రలో రైతు ఆత్మహత్యలు నీటి యుద్ధాలు జరిగేవని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీడు భూములను సాగులోకి వచ్చాయని అన్నారు. కాలేశ్వరం జలాలతో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని తెలంగాణ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం కెసిఆర్ కులవృత్తులకు జీవం పోసారని అన్నారు. కాలేశ్వరం జలాలతో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు. కాలేశ్వరం మొదటి ఫలితం కరీంనగర్ కి దక్కడం అదృష్టంఅని అన్నారు..భూగర్భ జలాలు పెంచేందుకు . మానేరు వాగు పై 5 ఇరుకుల్ల వాగు పై 4 చెక్ డ్యామ్ లు నిర్మించాంమని అన్నారు..కరీంనగర్ నియోజకవర్గంలో చెరువులన్నీ నింపుకున్నామని, తెలంగాణ అభివృద్ధి చూసి పెద్ద పెద్ద కంపెనీలన్ని కంపెనీలన్నీ హైదరాబాదుకు తరలివస్తున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఢిల్లీ ఆంధ్ర పాలకులు తెలంగాణపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.. తెలంగాణ వనరులను దోచుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు..సాధించుకున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత ప్రజలదేఅని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య జడ్పిటిసి పురమల్ల లలిత- శ్రీనివాస్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు,కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి సర్పంచ్ లక్ష్మీ ఐలయ్య, జక్కం నర్సయ్య, మడికంటి మారుతీ,జువ్వా డి రాజేశ్వర్ రావు, పంది తిరుపతి యాదవ్, కూర నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్, బిజెపిలు కేసీఆర్ జేబు సంస్థలు: షర్మిల

Satyam NEWS

కరోనా కేసుల్లో ఉచిత వైద్యం కోసం కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

Satyam NEWS

మోడీ మన్ కీ బాత్ విన్నారా వైసీపీ నేతలూ

Satyam NEWS

Leave a Comment