28.7 C
Hyderabad
April 20, 2024 04: 07 AM
Slider కరీంనగర్

రీమాండ్:నలుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

karimnagar police arrested 4 thievs

పలు దొంగతనాల కేసులలో నిందితులైన అంతర్రాష్ట్ర దొంగలను కరీంనగర్ సిసిఎస్ , వన్ టౌన్ పోలీసులు కలిసి చాకచక్యం గా పట్టుకున్నారని కరీంనగర్ అడిషనల్ డిసిపి చంద్రమోహన్ తెలిపారు.శుక్రవారం అయన మీడియా తో మాట్లాడుతూ ఇటీవల కరీంనగర్ లో పట్టపగలే జరిగిన చోరీలో నిందితుడైన ఆనంద్ కుమార్ ను పోలీస్ లు అరెస్ట్ చేశారని తెలిపారు.

ఆనంద్ రిటైర్డ్ ఉద్యోగి బూర్ల ఆత్మారాం ఇంట్లో పట్టపగలే దొంగతనం చేసి పారిపోగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తుపట్టి క్లూస్ టీం మరియు సైబర్ పోరెన్సిక్ నిపుణుల సహకారంతో నిందితున్నీ పట్టుకున్నా మన్నారు. ఇప్పటివరకు 28 దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా కూడా ప్రవర్తనలో మార్పు రాలేదని, మళ్లీ దొంగతనాలు వృత్తిగా చేస్తున్నాడని ఇతని పై పిడి ఆక్ట్ పెడుతామని తెలిపారు.

మరో కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు.వీరు 80 కేసుల్లో నిందితులని, వారిలో ఇద్దరు బావ బామ్మర్దులు కూడా ఉన్నారని నేరం చేయడమే ఒక వృత్తిగా భావించి అదేపనిగా ఆటోలు కార్లు అమాయక ప్రజలు ప్రయాణికులను బెదిరించి బంగారం నగదు తీసుకుని పారిపోతున్నారని అయన తెలిపారు.

డిసెంబర్ 25న కరీంనగర్ లోని కాశ్మీర్ గడ్డలో ఆడేపు సందీప్ అనే వ్యక్తి తన ఆటో కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ కేసుకు సంబంధించిన సీసీ కెమెరాలు ఆధారంగా సిసిఎస్ పోలీసులు నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. వారిలో ప్రధాన నిందితుడు సయ్యద్ యూసఫ్ మహమ్మద్ బషీర్ ఖాన్ దుర్గా హుస్సేన్ షా వాలి వీరంతా రాజేంద్రనగర్ రంగారెడ్డి సైబరాబాద్ ని వాసులని వీరిని అరెస్టు చేసి రికవరీ చేశామని త్వరలో మొత్తం రికవరీ చేస్తామని అన్నారు.ఈ సమావేశం లో సీసీఎస్ ఏసిపి శ్రీనివాస్ సి ఐ దేవారెడ్డి ఎస్సైలు అశోక్ రెడ్డి తదితరులు ఉండగా నిందితుల అరెస్ట్ కు సహక రించిన పోలీస్ లకు రివార్డ్ లు అందచేస్తామని చంద్రమోహన్ తెలిపారు.

Related posts

జొన్నలబొగుడ నీటిని విడుదల చేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Sub Editor

ఎజెండా ఉంది…. జెండా ఎంటో త్వరలోనే వెల్లడిస్తాం

Bhavani

ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలోకి ముద్రగడ?

Satyam NEWS

Leave a Comment