చిట్టడవులను పెంచడం కోసం తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను నాటేందుకు కరీంనగర్ పోలీస్ శాఖ మియావాకి పద్దతిలో మొక్కలు నాటేకార్యక్రమానికి శ్రీకారం చుట్టంది. సోమవారం నాడు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మొక్కనునాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పోలీస్‌శాఖ సిటి పోలీసు శిక్షణ కేంద్రం(సిపిటిసి)లో ఒక ఎకరం విస్తీర్ణంలో 12,500మొక్కల పెంపకాన్నిచేపట్టింది. ఈ సందర్భంగా ఎర్నాటైన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ వాతావరణంలోసమతుల్యత లోపించడం వల్లనే విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయని, పర్యావరణ పరిరక్షణలో భాగంగాతక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటేందుకు మియావాకి పద్దతిని అనుసరించనట్లయితే కాలానికనుగుణంగా మార్పులు వచ్చి ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించవచ్చాన్నారు.
గతంలో లాటి తూటాలకే పరిమితమైన పోలీసులు నేడు పెంద్రీపోలిసింగ్ విధానంతో అన్నివర్గాల ప్రజలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతుండటంతో నేరాలు నియంత్రణలోకి వచ్చాయని తెలిపారు. ప్రజల భద్రత,రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టడంలో పోలీస్ కమీషనర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.కమీషనర్ కమలాసన్‌రెడ్డి ప్రత్యేకశద్దతో కమిషనరేట్‌లో ప్రజల రక్షణ,భద్రత చర్యలను తీసుకోవడం వల్లనే దేశవ్యాప్తంగా కరీంనగర్ నాల్గవస్థానంలో నిలిచిందని తెలిపారు. గతంలో కల్లోలిత ప్రాంతంగా పేరొందిన కరీంనగర్ నేడు భద్రత,రక్షణ చర్యల్లో పటిష్ట చర్యలు తీసుకోవడం ద్వారా పలుసంస్థలు కంపెనిలు పెట్టెందుకు ముందుకువస్తున్నాయని, శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్రాంతాల్లోనే అభివృద్ది జరుగుతుందని పేర్కొన్నారు.
పోలీస్ కమీషనర్ విబి కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల రక్షణ,భద్రతకు పటిష్ట చర్యలు
తీసుకోవవడంతోపాటు పలు ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహిస్తుండటం వల్లనే అన్నివర్గాల ప్రజలతో
సత్సంబంధాలు పెంపాందుతున్నాయన్నారు. 2018లో 25వేల మొక్కలు నాటేందుకు రాష్టముఖ్యమంత్రికి
హామీ ఇచ్చి, 90శాతం మొక్కలను రక్షించామని తెలిపారు. మార్క్‌ఫెడ్ ఆవరణలో నాటిన మొక్కలకు డ్రిప్
విధానం ద్వారా నీరందించామని చెప్పారు. పట్టణప్రాంతాల్లో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను పెంచేందుకు జపాన్‌కు చెందిన శాస్త్రవేత్త మియావాకి సూచించిన మార్గాన్ని అనుసరించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. గతంలో వివిధ విడతలుగా జరిగిన హరితహారం కార్యక్రమాల సందర్భంగా పోలీస్‌శిక్షణ కేంద్రంలో నాటిన మొక్కల్లో 15వేల మొక్కలు రక్షించబడి, చెట్టుగా పెరిగాయని చెప్పారు. ప్రతివ్యక్తి పర్యావరణ పరిరక్షణ కోసం కనీసం 10మొక్కలను నాటాలని కోరారు.సిటి పోలీసుశిక్షణ కేంద్రం(సిపిటిసి)లో మొక్కలను రక్షించడం కోసంతోపాటు వివిధ అవసరాల కోసం వినియోగిస్తున్న బావి, శిక్షణలో ఉన్న పోలీసులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్‌రావు,డిప్యూటి మేయర్ చల్లస్వరూపరాణి హరిశంకర్,
స్థానిక కార్పోరేటర్ ఐలేందర్‌యాద్, రమణారావులతోపాటు సిపిటిసి ప్రిన్సిపాల్ ఎస్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్
శివభాస్కర్, ఎసిపిలు డాక్టర్ పి అశోక్, శంకర్‌రాజు, ఇండోర్, అవుట్‌డోర్ విభాగాలకు చెందిన అధికారులు
నాగేందర్, కిరణ్‌కుమార్, ఇన్స్‌పెక్టర్లు విజయ్‌కుమార్, దేవారెడ్డి, విజ్ఞాన్‌రావు, తుల శ్రీనివాసరావు,
దామోదర్‌రెడ్డి, ఎస్‌బిఐ ఇంద్రసేనారెడ్డి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, శాంతి,సంక్షేమకమిటి
సభ్యులతోపాటు ఇండోర్,అవుట్‌డోర్ విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.