సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించిన మహాత్మా గాంధీకి కరీంనగర్ పోలీస్ కమిషనర్ V.B కమలాసన్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. నేడు గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన మహాత్మా గాంధీని స్మరించుకున్నారు. బ్రిటిష్ నిరంకుశ పాలనపై శాంతియుతంగా పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అందించిన జాతిపిత మహాత్మాగాంధీ ని మనం నిత్యం స్మరించుకోవాలని ఆయన అన్నారు.
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పోలీస్ కమిషనర్ V.B కమలాసన్ రెడ్డి తో బాటు అడిషనల్ డిసిపి G.చంద్రమోహన్, అడిషనల్ డిసిసి (శాంతి భద్రతలు) శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ RI అడ్మిషన్ మల్లేశం, MTO జానిమియా, A.O CPO అఫిసర్స్ స్టాఫ్, పోలీస్ ఆఫీసర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.