32.2 C
Hyderabad
April 20, 2024 19: 04 PM
Slider ప్రత్యేకం

డేంజర్ బెల్స్: ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా

carona virus

చైనా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తాజాగా ప్రపంచంలోని 10 దేశాలకు పాకింది. చైనా దేశంలో ఎంతో మందిని బలితీసుకుంటున్న ఈ కరోనా వైరస్ 2,744 మందికి సోకగా, వీరిలో ఇప్పటి వరకూ 80 మంది మరణించారు. చైనాలో కరోనా వైరస్ రోగుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్క ఆదివారం రోజే చైనాలో కొత్తగా 769 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని చైనా అధికారులు చెప్పారు.

చైనాలోని 12 నగరాల్లో ఈ వైరస్ సోకడం వల్ల 56 మిలియన్ల మంది ప్రజలు వారి నగరాల నుంచి రాకపోకలు సాగించకుండా నిషేధం విధించారు.  వుహాన్ నగరంలో ప్రబలిన కరోనావైరస్ ప్రపంచంలోని థాయ్‌లాండ్, జపాన్, కొరియా, అమెరికా, వియత్నాం, సింగపూర్, మలేషియా, నేపాల్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ వ్యాప్తి చెందాయి. థాయ్‌లాండ్ దేశంలో 7, జపాన్ లో 3, కొరియాలో 3, అమెరికాలో 3, వియత్నాంలో 2, సింగపూర్ లో 4, మలేషియాలో 3, నేపాల్ లో 1, ఫ్రాన్స్ లో 3, ఆస్ట్రేలియాలో 4 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

Related posts

పరమ భాగవతోత్తముడు నారాయణతీర్థుడు

Satyam NEWS

పెట్రోలు బంకులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

Satyam NEWS

రాజంపేట నుండి రాజోలు వరకూ జనసేనదే విజయం

Satyam NEWS

Leave a Comment