28.7 C
Hyderabad
April 20, 2024 05: 40 AM
Slider హైదరాబాద్

కన్నుమూసిన కర్షక్ ఇండస్ట్రీస్ అధినేత

#brahmanandachari

ప్రముఖ సంఘసేవకుడు, కర్షక్ ఇండస్ట్రీస్ అధినేత పసునూరి బ్రహ్మానందాచారి ఇక లేరు. ఎన్నో సాంస్కృతిక సంస్థలకు చేదోడువాదోడుగా ఉంటూ కవులను, కళాకారులను ప్రోత్సహించిన బ్రహ్మానందాచారి మరణం తీరని లోటని హైదరాబాద్ పాత నగర కవుల వేదిక సెక్రటరీ కె.హరనాథ్ అన్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక ప్రాంతంలో గత 75 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న బ్రహ్మానందాచారి పరిసర గ్రామ వాసులకు వ్యవసాయ బావులను పూడిక తీయడానికి ఉపయోగించే క్రెయిన్ లను తయారు చేసి అతి చౌక ధరకు అందించేవారని హరనాథ్ గుర్తు చేశారు. సేవాభావంతో ఆయన చేసిన ఈ పనితో ఎందరో వ్యవసాయదారులకు లబ్ది చేకూరిందని ఆయన తెలిపారు. ఎన్నో పాఠశాలలకు అవసరమైన సహాయాన్ని అందించి పేద విద్యార్ధులకు చేదోడువాదోడుగా నిలిచేవారని హరనాథ్ తెలిపారు. ఆయన ఆకస్మిక మరణం పాత నగర వాసులకు తీరని లోటని ఆయన అన్నారు.

Related posts

మురికి నీటితో నిండిపోతున్న నాగావళి నది

Satyam NEWS

మూఢ నమ్మ‌కాల‌కు స్వ‌స్తి ప‌లికాలి… నిర్భ‌యంగా బ్ర‌తకాలి…!

Satyam NEWS

రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ఏకగ్రీవ ఎన్నిక

Satyam NEWS

Leave a Comment