హైదరాబాద్ వనస్థలిపురంలో వైభవోపేతంగా కార్తీక మాసోత్సవం జరిగింది. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ చివరి రోజు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ కు తూర్పు దిక్కున ఉన్న వనస్థలిపురంలో ప్రతి ఏడాది మాదిరి గానే ఈ ఏడు కూడా భక్తుల సహాయ సహాయములతో, శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి సంస్థానం సహాయ సహకారములతో, వనస్థలిపురం ఎల్ఐజీ బీ బ్లాక్ ఫేస్ 1 రెసిడెన్సిల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఈ కార్తిక మాసం ఆసాంతం నిర్వహించిన రుద్రాభిషేకములు, విశేషపూజలు, పోలిస్వర్గము, శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం ఉత్సవాలు పరమేశ్వరానుగ్రహంతో జయప్రదంగా దిగ్విజయం గా ముగిసాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసి పూజ కార్యక్రమం లో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి, వనస్థలిపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్ గుప్తాలు ముఖ్య అతిథులు గా పాల్గొన్నారు. ఇక జరిగిన కార్యక్రమాలలో నిర్వహణకు ఆర్థిక సహాయ తోడ్పాటును అందజేసిన ప్రతి ఒక్క భక్తునికీ, భక్తురాలికి శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి సమస్థానం వనస్థలిపురం హైదరాబాద్ తరుపున హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతోంది.
లోకాకళ్యాణర్ధం నిర్వహించిన ఈ పూజల ద్వారా లోకం సుభిక్షముగా, సుభద్రముగా విలసిల్లేలా దీవించాలని ఆయన కార్తిక దామోదారుణ్ణి, భ్రమరాంబికా మల్లికార్జునలను ప్రార్ధిస్తూ సహకరించిన భక్తులకు, శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి సమస్థానం వనస్థలిపురం హైదరాబాద్ ( దేవాలయ కమిటీ) వారికి ఆ పరంధాముని దివ్య అనుగ్రహ కృప కటాక్షాలు అంది సర్వదా సర్వ కార్యములందు దిగ్విజయం కలగాలని కోరుకుంటున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మల్లావజ్జుల వెంకట మణి శేఖర్, అలాగే ఉపాధ్యక్షలు గాండ్ల అంజయ్య, ఆవుల రామిరెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.