రాళ్లు విసరడం లాంటి చెదురుమదురు సంఘటనలు మినహా జమ్మూ, కాశ్మీర్, లఢఖ్ ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. శ్రీనగర్‌లో కొన్ని షాపులు తెరుచుకున్నాయి. టూవీలర్లు, కార్ల మీద స్థానికులు తిరగడం అక్కడక్కడా కనిపించింది. 144 సెక్షన్ కొనసాగుతున్నా జనం నెమ్మదిగా రోడ్లమీదకు రావడం మొదలుపెట్టారని సీనియర్ అధికారి చెప్పారు. కొన్ని చోట్ల మాత్రం రాళ్లు విసిరిన సంఘటనలు జరిగాయన్నారు. పూంఛ్ జిల్లా బఫ్లయిజ్ ఏరియాలో ఆందోళనకారులు రాళ్లు విసిరిన సంఘటనలో పొలిసు అధికారి ఒకరికి దెబ్బలు తగిలాయి. శ్రీనగర్‌లో నిరసనకారులు ఆందోళన చేసినట్టు వార్తలొచ్చాయి. ఆందోళన చేస్తున్న యువకుణ్ని పోలీసులు వెంటపడి తరుముతుండగా అతను జీలం నదిలోకి దూకి చనిపోయినట్టు అధికారులు చెప్పారు. ఆందోళనకారుల దాడుల్లో ఆరుగురు గాయపడ్డారని, వాళ్లు శ్రీనగర్ హాస్పటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టు వార్తలొచ్చాయి.370 ఆర్టికల్ రద్దుతో రాజకీయ అవినీతి తొలగిపోతుందని బోర్డర్‌లో ఉన్న కుప్వారా జిల్లా వాసులు ఆనంద పడుతున్నట్టు వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 370 ఆర్టికల్ రద్దును నిరసిస్తూ కార్గిల్ టౌన్‌లో బంద్ పాటిస్తున్నారు. దీంతో కార్గిల్‌లో చిక్కుకున్న టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి జమ్మూకు ఒక్కొక్కరికి 2500 నుంచి 3000 వరకు టాక్సీ డ్రైవర్లు వసూలు చేస్తున్నట్టు టూరిస్టులు ఆరోపిస్తున్నారు.
previous post