31.7 C
Hyderabad
April 25, 2024 01: 58 AM
Slider ముఖ్యంశాలు

ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్ మేలు కోసమే

Ramnath-kovind

రాజ్యంగంలోని 370 అధికారణ రద్దుతో జమ్మూ కాశ్మీర్, లద్దాక్ ప్రజలకు ఎనలేని మేలుకలుగుతుందని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇటీవల జరిగిన మార్పుల వల్ల జమ్మూకాశ్మీర్‌ ప్రజలు ఎంతో లాభం పొందుతారు. వారు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే సమాన హక్కులు, అధికారాలు, సౌకర్యాలు పొందేందుకు ఈ మార్పులు దోహదపడతాయి అని ఆయన స్పష్టం చేశారు. దేశం యావత్తు 73వ స్వాతంత్ర్య దినోత్సం జరుపుకొంటున్న ఈ వేళ మనముందున్న లక్ష్యం ఒక్కటేనని అదే సమగ్రమైన అభివృద్ధి అని ఆయన అన్నారు. 73 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు ఈ ఏడాది అక్టోబర్‌ 2న గాంధీజీ 150వ జయంతి వేడుకలను జరుపుకోనున్నాం. అంతేకాదు గురునానక్‌ 550వ జయంతి వేడుకలు కూడా ఈ ఏడాదే  జరగనున్నాయి అని రాష్ట్రపతి తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయడం, దేశ ప్రతిష్ఠను ఉన్నత స్థానంలో నిలబెట్టడం అందరి లక్ష్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారని, ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రదర్శించారని ఆయన అన్నారు. ఓటేసేందుకు ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ఇవాళ మనందరి లక్ష్యం దేశాభివృద్ధి. అందుకోసం 130కోట్ల మంది ప్రజలు తమలో ఉన్న నైపుణ్యాలను వెలికితీయాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం పెరుగుతోంది. బతుకు, బతకనివ్వు అనేదే మన నినాదం. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ సమావేశాలు సైతం చక్కటి వాతావరణంలో జరిగాయి. అందుకు సంతోషంగా ఉంది అని రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.

Related posts

అక్సిడెంట్:కురిక్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం5 గురి మృతి

Satyam NEWS

భక్తి భావనతో దైవానుగ్రహం పొందవచ్చు

Satyam NEWS

డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తం దానంతో ప్రాణాపాయ రక్షణ

Satyam NEWS

Leave a Comment