32.7 C
Hyderabad
March 29, 2024 11: 08 AM
Slider హైదరాబాద్

ఎలర్ట్: కాటేదాన్ చిరుత ఇంకా చిక్కలేదు జాగ్రత్త

#Katedan Tiger

హైదరాబాద్‌ శివారులోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని ఆయన తెలిపారు. కాటేదాన్‌, బుద్వేల్‌ వాసులు బయటకు రావొద్దని సూచించారు. కుక్కల అరుపులు వినిపస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలన్నారు.

అలసిపోయిన చిరుత స్థానికంగా ఉన్న తోటలో నక్కినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అగ్రికల్చర్‌ యూనివర్సిటీ వైపు నుంచి చిరుత వచ్చినట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. ప్రజలెవరూ భయాందోళనకు గురికావొద్దు అని డీసీపీ పేర్కొన్నారు.

Related posts

ఉప్పల ట్రస్ట్ మాకు ఓ కల్పవృక్షం

Satyam NEWS

రాచరికం కాదు కేసీఆర్ ది సంక్షేమ రాజ్యం

Satyam NEWS

తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిభాయీ ఫూలే బాట‌లో న‌డ‌వాలి

Sub Editor

Leave a Comment