32.2 C
Hyderabad
March 28, 2024 23: 31 PM
Slider నెల్లూరు

కవచ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం

#kavacha

కరోనా ఫస్ట్ వేవ్ లో చేసిన విధంగానే సెకండ్ వేవ్ లో కూడా కవచ చారిటబుల్ ట్రస్ట్ కరోనా రోగులకు సేవలు అందిస్తున్నది.

నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వారు చేస్తున్న సేవలు అభినందనీయమని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కె. శ్రీనివాసరావు అన్నారు.

కవచ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి, పేషెంట్లకు పౌష్టికాహారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా మొదటి వేవ్ లో అదేవిధంగా సెకండ్ వేవ్ లో తమ సిబ్బంది ఏలాంటి  సెలవు తీసుకోకుండా రాత్రింబవళ్ళు ప్రజల రక్షణ కోసం కష్టపడుతున్నారని అన్నారు.

వారి సేవలను గుర్తించి కవచ చారిటబుల్ ట్రస్ట్ అధినేత గుండు మనోజ్ కుమార్ తమ సిబ్బందికి సేవలు అందించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

గుండు మనోజ్ కుమార్ మాట్లాడుతూ కరోనా సమయంలోప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ప్రజల ప్రాణాలను కాపాడుతూ, ఎలాంటి సెలవులు తీసుకోకుండా, రాత్రింబవళ్ళు కష్టపడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి పారిశుద్ధ్య కార్మికులకు వెంకటగిరి ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, వారి సేవలను ఇలాగే కొనసాగించాలని, భవిష్యత్తులో కూడా తమ వంతు సేవా కార్యక్రమాలను ఇలాగే కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కవిత, కవచ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు డాక్టర్ బొక్కిసం రమేష్, తమటం హరీష్, సాయి రాయల్, వరప్రసాద్, సుమంత్, గుండు ప్రేమ్, ఆసుపత్రి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

కె.రమాకాంత్

Related posts

రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల కోటా విడుద‌ల

Satyam NEWS

టై అప్:అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్ట్ అప్ రంగాల్లో న్యూజిలాండ్

Satyam NEWS

ప్రజల సమస్యలు ఆలకించిన అడిషనల్ కలెక్టర్

Satyam NEWS

Leave a Comment