36.2 C
Hyderabad
April 18, 2024 14: 06 PM
Slider కవి ప్రపంచం

సముద్రమంత దుఃఖం

#Kondapally Niharini

దీపాలు రెపరెపలాడేవేళ

నిన్న చెదిరిన కల ఒకటి నడిచొచ్చింది.

ఒకానొక ఆత్మకథలా వెంటాడుతున్నది.

అశాంతి కేకల చితిమంటల మృత్యువది

అవి సహజ మరణాలు కానప్పుడు

ఆత్మలూ వెంటాడుతాయి.

అన్యాయమూ వెంటాడుతుంది !

కాలప్రభంజనం భళ్ళునతెల్లారకముందే

అమ్మచెంగటన పెరిగిన ప్రాణి,నాన్న దగ్గరి గమనింపుల బ్రతుకూ  జీవచ్ఛమై,

అన్నా,అక్కా ,అత్త ,చిన్నాన్న, పెద్దమ్మ,

అత్తామామల పిలుపుల రూపులన్నీ

టపటప రాలినపడిన దృశ్యాలై

పొగలా చుట్టుకున్నవి.   

గుండెగూటానికి ప్రేమదారాలు తగిలించిన జంటలో, పంటలో చావు మంటలకుఆహుతయినపుడు, సంతసానికి ఆవైపు , సంతసానికి ఈ వైపు మరచిపోలేని ప్రశ్నమౌనంగాఉన్నప్పుడు

చిటికెడు ప్రాపంపంచిక సుఖాలు , ప్రపంచానికందించే సౌకర్యాలే ప్రమాదాలైనప్పుడు విషం …. విషం …

వాయువై..వాహికై….. ప్రాణాలు హరించిన విషయం వెనుక దాగిన దాష్టీకం , ప్రాణదీపాలార్పిన చిట్టాల్లోనే

రాస్తారు. చిత్తాల్లోంచి తీయలేరని

ఏ శాఖలు లేని విశాఖసముద్రుడు ఇప్పుడు గుంభనంగా రోదిస్తున్నాడు

కొండపల్లి నీహారిణి

Related posts

దేవాదాయ మంత్రిని, దుర్గగుడి ఈవోను తొలగించాలి

Satyam NEWS

గ్రాఫిక్స్ తో మైమరపించే మంచు లక్ష్మి”ఆదిపర్వం”

Satyam NEWS

రామతీర్థం కొండపై రాముని విగ్రహం ధ్వంసం..!

Satyam NEWS

Leave a Comment