Slider కవి ప్రపంచం

ఎవరి మేధో మధనం ..?

#Sailaja Mitra

ఇప్పుడు

ప్రతి బతుకు వ్యాపారమే

ప్రతి క్షణం

అన్న ఆహారాల

లావాదేవీల పరిష్కారమే..

ఇప్పుడు నవమాసాలు మోసి కన్నతల్లికి

కాళ్ళేడ్చుకు పోతున్న కూలీకి పెద్ద తేడా లేదు

తల్లి చాకిరీ కై ఇంట్లో నడుస్తోంది

రోజు కూలీ ఇల్లు లేక బయట అంతే .. !

ఇప్పుడు

అన్నింటికీ మంచి బేరాలున్నాయి

కన్నీటి ప్రవాహానికైనా

చచ్చిన కన్నవారి శరీరాలకైనా

ప్రేమకైనా ప్రేరణకైనా

అవసరాన్ని బట్టి మార్కెట్ ధర .. అంతే

ఆడవారి ప్రాణాలు కానీ..

తాగి చేసే తప్పుడు పనులకు గానీ

శిక్షలు, చిల్లర దుకాణాల్లో

తక్కువకే దొరుకుతున్నాయి

తలుపులు మూత పడ్డాక

సెంటిమెంట్లు, అనురాగాలు

నిత్యావసర సరుకులుగా మారి

నిత్యం మూకుట్లో మురుకుల్లా

వంట గదిలో సల సలా కాగుతూ మేము

బతికేందుకు దారిలేక

రైలు పట్టాలపై ఎండలో మండుతూ వారు

ఎవరైతేనేమి

అందరికి అనుభవ పాఠశాలల మయ్యాము

అవకాశాలన్నీ అమ్ముడైపోయి

ఆనందాలన్నీ ఆవిరైపోయాక

కడుపుబ్బరాలు, ఆకలి డొక్కలు  మాత్రం

భరించలేక మూలుగుతూ మిగిలిపోతాయి

ఇప్పుడు భూగోళమంతా

కరోనా రాకతో ఏడుస్తూ కూర్చుండిపోయింది

ఎవరి మేధో మధనం తల్లి నువ్వు >

మనిషిలో చేరిపోయావు

వెక్కెక్కి ఏడవక తప్పదు

శైలజామిత్ర, హైదరాబాద్

Related posts

ఉత్తరాది రైతులకు సంఘీభావంగా ఈ నెల 3వ తేదీన ధర్నా

Satyam NEWS

సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రమాణస్వీకారం రేపు

Satyam NEWS

Protest on police: నేరం చేసిన వైసీపీ నేతపై చర్య తీసుకోరా?

Satyam NEWS

Leave a Comment