35.2 C
Hyderabad
April 20, 2024 18: 13 PM
Slider కవి ప్రపంచం

వంటింటి ఘుమ ఘుమలు

#Manjula Surya New

ముచ్చటైన నా వంటిల్లు

తళతళలాడే వంటగిన్నెల పొదరిల్లు

యుధ్ధమే అనిపించే కత్తులు కటార్ల ఆరళ్లు

నేను పాలించే నా  నట్టిల్లు

పసందైన రుచులకు పుట్టిల్లు

నా చేతి వంటల హరివిల్లు

కాఫీ టీల పొగలు సెగల చిరుజల్లు

సిప్పు సిప్పుకి  మనసు తెప్పరిల్లు

పోపులు నూనెల ఘుమఘుమల వాకిళ్ళు

రా రమ్మని పిలిచే మసాలాల లోగిళ్లు

జిహ్వ చాపల్యాన్ని పెంచే రోటిపచ్చళ్ళు

నేడు కానరాని రోళ్ళు రోకళ్ళు

ఘాటుఉల్లిపాయతోనే మరి కళ్ళు చిప్పిల్లు

గరిట గమకాలతో మనసు రంజిల్లు

మిక్సీ శబ్దాలతో చెవులు హోరిల్లు

హుషారునిచ్చే కుక్కర్ విజిళ్ళు

మాడిన కూరలు చూసి మనసు భీతిల్లు

పండుగలు పబ్బాలకు నిద్రలేని రాత్రుళ్ళు

అసలునే మించే కొసరు చిరుతిళ్లు

విరామము లేని వంటల సందళ్ళు

చేసి చేసి వొళ్ళు డల్లు డల్లు

చూసి చూసి వంటలంటేనే వేవిళ్ళు

అయినా తప్పదు చేసుళ్ళు

మరి హోటల్ భోజనానికిక చెల్లు చెల్లు

లేదంటే  పడునులే జేబుకు చిల్లు

కట్టలేక లబోదిబో హాస్పిటల్ బిల్లు

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

ఈనెల 9న జరిగే జైల్ భరో కార్యక్రమం జయప్రదం చేయండి

Satyam NEWS

తిరుమ‌ల‌లో తరిగొండ వెంగమాంబ ఆరాధన కేంద్రం ఏర్పాటు

Satyam NEWS

కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్య విజయం

Satyam NEWS

2 comments

Yuddandi Siva Subramanyam July 29, 2021 at 4:22 AM

చాలా బాగుంది రచనా శైలి.

Reply
Satyam NEWS August 8, 2021 at 11:23 AM

thank you

Reply

Leave a Comment