27.7 C
Hyderabad
March 29, 2024 04: 30 AM
Slider కవి ప్రపంచం

ప్రియా! నీవెక్కడ??!

#Viswika Secunderabad

ప్రియా..!

నీ తలపుల

మంచుమంటలలో

ఆదమరచి నేను

చలి కాచుకుంటుంటే

రివ్వున వచ్చిన పిల్లగాలులు

ఎక్కడ నీవాడని

కొంటెగా వెక్కిరిస్తున్నాయి..

ప్రియా నీవెక్కడ..?

నీ చింతనల

జడివానలలో

ఉక్కిరిబిక్కిరై నేను

తనిసి పోతుంటే

తుంటరి తుమ్మెదలు

నీ తోడేడని గారాల

రాగాలు తీస్తున్నాయి…

ప్రియా నీవెక్కడ..?

నీ ఎడబాటు యాగాలలో

సమిధనై నే

రవులుతుంటే

జాలి పరిమళాలు

విసురుతూ పారిజాతాలు

అల్లరిగా నవ్వుతున్నాయి..

ప్రియా నీవెక్కడ..?

ఆ వెన్నదొంగ లా

తక్షణమే ప్రత్యక్షమై

నా నిరీక్షణా వీక్షణాలు

పండించలేవా..!

నీ కటాక్షణా ప్రోక్షణాల

తరించనీవా..!

విశ్వైక, సికింద్రాబాదు

Related posts

నరసరావుపేటలో పెద్దఎత్తు కాగడాల ప్రదర్శన

Satyam NEWS

అఫిడవిట్లు దాఖలు చేయండి- హైకోర్టు

Satyam NEWS

మాపై రాళ్లతో దాడి చేశారు: అందుకే ఫైరింగ్

Satyam NEWS

Leave a Comment