38.2 C
Hyderabad
April 25, 2024 14: 45 PM
Slider కవి ప్రపంచం

నీ లోకి నీవు సాగు

#Yalamarthy Anuradha

చుర్రు మంటున్న ఎండ

మనసు కుతకుతలాడుతూ

చల్లని సమీరం తోడైతే

హాయి లాలస చెంత చేరినట్లే

చిరునవ్వు పెదాల మీద

లాస్యమాడితే

ముల్లోకాలు ముందుకు వచ్చినట్లే

ప్రక్కవాని చెయ్యి

భుజానికి ఆసరాగా నిలబడితే

కొండంత ధైర్యం కన్నులయెదుట సాక్షాత్కారమే

పసివాళ్ళతో ఆటలు మొదలుపెడితే

కల్మషం మొత్తం కరిగి పోయినట్లే

బంధం అనుబంధం అక్కర్లేదనుకుంటే

సర్వం కోల్పోయినట్లేనని తెలుసుకో

కాల్పనిక జగత్తు ఎంతున్నా ఫలితమేమి

సత్యం నిత్యం నిజం లో ఓ

క్షణమున్నా చాలు

ఎక్కడెక్కడోవెతుకుతావు భగవంతుని కోసం

నీ లోనే ఉన్నాడని తెలుసుకునేప్పటికి

జీవితం ముగిసిపోతుంది

ఎదుటి వాళ్ళ జీవితంలోకి తొంగి చూడటం అంటే ఎంతో ఇష్టం

నీలోకి నువ్వు మాత్రం ఒక్కసారి కూడా వెళ్ళవు

మనిషి జన్మ అత్యంత విలువైనది

సహృదయత

మానవత్వాలతో దాన్ని నింపుకో!

యలమర్తి అనూరాధ, హైదరాబాద్, చరవాణి:9247260206

Related posts

అనారోగ్యంతో మరణించిన కుటుంబానికి కౌన్సిలర్ అండ

Satyam NEWS

లేపాక్షి ఆలయానికి యునెస్కో గుర్తింపు త్వరలో

Satyam NEWS

భాష, సంస్కృతుల పరిరక్షణే విశ్వనాథ వారికి నిజమైన నివాళి

Satyam NEWS

Leave a Comment