39.2 C
Hyderabad
April 25, 2024 16: 39 PM
కవి ప్రపంచం

తొలి మంచు స్వప్నం

#Sujata P V L

ఆశల విరులు

కనుదోయిలో విరియగా..

చెక్కిలి కప్పేసిన

బిడియపు వలువలు

చిరు తపనల తడిసి

వలపు జల్లై మురియగా..

వెన్నెల కాంతి

మంచు ముత్యంలా భాసిస్తూ

కనువిందు చేస్తోంది..

జాబిల్లిని కాసింత బొట్టు చేసుకొని

నుదుటిన సింగారించుకుంది ఆకాశం..

హృదిలో ఊసుల తావి అద్ది

ఉరికే మనసుకి హద్దు లేదని

విరిసే కన్నుల వన్నెల చిన్నెలతో

గారం మిళితం చేస్తూ..

తొలకరి జల్లై కురిసి..

నయాగరాను నేలకు జార్చింది..

అంబరాన తళుకు వీణలు మీటుతూ

సంబరంతో జలజల జలపాతమై జాలువారింది..

కలహంస నడకల హొయలు..

ఒంపు సొంపుల సొబగులు..

మృదు మధుర స్వర జతులతో

మేఘాన్ని కరిగించింది పవనం..

మధురాశల రెక్కలు తొడుక్కొని

స్వాప్నిక జగత్తులో విహరిస్తున్న మనసును

నులి వెచ్చని ప్రభాత కిరణం తాకి

తెలి మంచు స్వప్నాన్ని కదిలించింది

సుజాత.పి.వి.ఎల్. సైనిక్ పురి, సికిందరాబాద్.

Related posts

నిస్వార్థ భావనే ప్రేమ

Satyam NEWS

పి. వి. తెలంగాణ జీవి

Satyam NEWS

ఆదర్శ భారతీయుడు

Satyam NEWS

Leave a Comment