ఏకాంత మందిరాన
నీకాంతను ఏకను చేసి
ఎరుక మరచి
ఏకోనల ఏగుచుంటివో?
ఎడబాటు యాగాలు
ఎన్నేండ్లకు పండింతువో?
అన్న సేవకే అంకితమైన
అనుంగు సోదరుడవే ఐనా
ఆలి బాధ ఎరుగని
అమాయకుడవేం కాదుగదా?
నీవులేని నిశీధి వనంలో
నిరీక్షణా నయనాల దివ్వెలతో
నిరంతరం నివేదన చేస్తున్నా
అవ్యక్త అనుభూతుల ఆగడాలు
అనునిత్యం అవస్థ పెడుతుంటే
అడ్డగించలేని అసక్తతను తెలుపుతున్నా
ఆశల శిఖరాన ఆరని జ్యోతులతో
హృదయ క్షేత్రంలో నిలిచిన నీకై
వేచివుందును మంగళనై నీ ఊర్మిళనై
విశ్వైక, సికింద్రాబాదు