37.2 C
Hyderabad
March 29, 2024 17: 38 PM
Slider కవి ప్రపంచం

కాలచక్రం

#PVS Krishnakumari

కాల భ్రమణంలో మరోసారి

వచ్చింది శరదృతువు

తనతోనే తెచ్చింది పూల పండుగను

పుష్ప సుగంధ పరిమళాలు వ్యాపించగా

పడతులందరు ఆడారు బతుకమ్మలు

గ్రీష్మాన్ని ఓడించాననే ఆనందంతో విర్రవీగి

వర్షించి, వర్షించి నీరసించి

వెనుదిరిగాడు వరుణుడు

నింగి నల్లని వస్త్రాలని విసర్జించి

ధవళ వస్త్రధారిణియై

ప్రశాంత వదనంతో

మనసులను రంజిల్ల చేస్తున్నది.

ఇదే అవకాశం అనుకున్న రేరాజు

బలం పుంజుకుంటుని,

హిమవంతుడు రాకముందే

తన ప్రతాపాన్ని చూపించాలని

తహతహలాడుతున్నాడు.

పుష్ప, ఫల భరితమైన వృక్షాలు

మౌనముద్రని దాల్చి

నిశ్చల మనసుతో,

సమాధి స్థితిలో ధ్యానమగ్నులైన

మునులను తలపిస్తున్నాయి

వరుణుని ధాటికి నిండుకుండల్లా

మారిన తటాకాలలోని

నిశ్చలమైన నీటిలో

తమ ప్రతి బింబాలని చూసుకుని

మురిసి పోతున్నాయి తారకలు

చూస్తూఉండగానే

కాలం కరిగి పోతుంది

హిమవంతుడు వస్తాడు

శిశిరానికి దారి చూపిస్తాడు

కాలభ్రమణంలో

ఋతువులు తిరుగుతూనే ఉంటాయి.

పీ.వి.యస్.కృష్ణ కుమారి

Related posts

హౌ ఆర్ యు: రాయపాటికి చదలవాడ పరామర్శ

Satyam NEWS

వయసు చిన్నదే అయినా…మనసు మాత్రం పెద్దది

Satyam NEWS

నవజ్యోత్ సింగ్ సిద్ధూ పై ఆప్ నేత వ్యాఖ్యలు

Sub Editor

Leave a Comment