40.2 C
Hyderabad
April 24, 2024 16: 50 PM
Slider కవి ప్రపంచం

సుమసిరి

#Sandhya Sutrave New

తెలంగాణా సంస్కృతిలో

ప్రత్యేక సుమశృంగమే

బతుకమ్మపండుగ

మహాలయ అమావాస్యతో

ఎంగిలి పూబతుకమ్మ తొలిగా

సద్దులబతుకమ్మ మలిగా

తొమ్మిదిరోజులు నయనానంద సంబరం

ఈ పండుగ  శరన్నవ రాత్రుల్లో

తొలిచలి, వర్షపు చినుకుల సవ్వడిలో

గునుగు, తంగేడు,బంతి

చామంతి,గులాబి,నందివర్ధనాలతో

రంగురంగుల పూలశిఖరాలను పేర్చి

ఆవిష్కృత సుమ సోయగాల చుట్టూ

అలంకృత అంగనలు

చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ

ఒకేలయతో పాటలు పాడుతూ

జరుపుకోవటం ఆనవాయితి

ఈ పాటలు మహిళల కష్టసుఖాలు

ప్రేమ,స్నేహం,బంధుత్వం,ఆప్యాయత

భక్తి,భయం,చరిత్ర,పురాణాలను ప్రతిబింబిస్తాయి

పూల సింగిడికి రోజుకో

నైవేద్య సమర్పణ ప్రత్యేకత

ఆడపడుచులు అత్తారింటి నుంచి

అమ్మగారింటికి చేరుకొని

గౌరి దేవిని కీర్తిస్తూ,ఒక్క చోట చేరి

ఆడిపాడి వాయినాలు

ఇచ్చిపుచ్చుకొనే పండుగ

అందరూ ఊరేగింపుగా

జలాశయం చేరి భక్తిశ్రద్ధలతో

సుమసోయగాలను మెల్లగా

నీటిలో జారవిడిచి,బతుకమ్మా

మాకు సంతోషకరమైన

బతుకునీవమ్మా  అని వేడుకునే వేడుక

సంధ్య సుత్రావె, సుల్తాన్షాహి,హైద్రాబాద్, ఫోన్:9177615967

Related posts

రుణ మాఫీ పథకం అమలు తెలంగాణలో కేవలం ఐదు శాతమే

Satyam NEWS

క‌రోనా రోగుల‌కు ఉత్త‌మ సేవ‌లందించ‌ట‌మే ల‌క్ష్యం

Satyam NEWS

తిరుమల తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? ఇది చదవండి

Satyam NEWS

Leave a Comment