37.2 C
Hyderabad
March 28, 2024 19: 06 PM
Slider కవి ప్రపంచం

పూల పండుగ మనసు నిండగ..

#J Shayamala New

గునుగు పూల గుసగుసలు

తంగేడు పూల తళతళలు

సొగసైన పట్టుకుచ్చుల  పూలు

కళకళలాడే కట్ల పూలు

బంతిపూల బడాయిలు

చేమంతుల సిరి నవ్వులు

ఎన్నెన్ని పూలు.. ఎంతెంత సందడి

బతుకమ్మ పండుగొచ్చిందంటే

తెలంగాణ నేల పూల జాతరే

ఆడబిడ్డలకు సంబురమే సంబురం

అవ్వ..అమ్మ..అత్త

అక్క..చెల్లి..వదిన..మరదలు

బతుకు బాధలు మరచి

తీరు తీరుగ బతుకమ్మలు పేర్చి

గౌరమ్మకు భక్తితో మొక్కి

మస్తుగ ముస్తాబై

బతుకమ్మలను నడుమన బెట్టి

పాటలు పాడి.. ఆటలు ఆడి

బతుకమ్మలను చెరువులో వదిలి

వచ్చే ఏడాది మళ్లీ రమ్మంటూ

వీడలేకున్నా  వీడ్కోలు పలికి

మలీద ప్రసాదాలు పంచుకుని

మరలిపోయేరు మగువలు

పూల పండుగ మనసు నిండగ !

జె. శ్యామల

Related posts

అధికారం ముగిసే ఈ కాలంలో కొత్త కాపురం ఎందుకో…?

Satyam NEWS

చేనేత కార్మికుల్ని అణచివేస్తున్న కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS

క‌లెక్ట‌ర్ కు రాష్ట్ర స్థాయిలో ఉత్త‌మ జిల్లా ఎన్నిక‌ల సంఘం అవార్డు

Sub Editor

1 comment

Gannavarapu Narasimha Murty October 15, 2021 at 8:33 PM

పూల పండగ మీద పూవుల
గురించి వ్రాసిన గేయం హృద్యంగా ఉంది
రచయిత్రి గారికి అభినందనలు

Reply

Leave a Comment