34.2 C
Hyderabad
April 19, 2024 22: 23 PM
Slider కవి ప్రపంచం

‘సింహవాహిని దర్శనం-సకల పాప సంహారం’

#PVLSujata

నూట పదేళ్ళ చరిత్ర గల

ఆలయంలో కొలువైనట్టి

త్రిభువన జననివి నీవమ్మా!

అంబిక, కాళిక, చండీ,

పార్వతీ, చాముండేశ్వరి రూపాలు నీవమ్మా!

అందాలొలికే లాల్ దర్వాజాను చూడమ్మా!!

బంతీ,చామంతులు, ఎర్ర,తెల్ల కలువలు,

పారిజాత, పొగడ పూలు, మందార, నందివర్ధనాలు

నీ పూజకై విరిసె మురిసె..

ఓ మారు ఇటు కనవమ్మా!..

సర్వ పుణ్య సమాహారం..మహంకాళీ నామం..

సకల పాప సంహారం..సింహవాహినీ దర్శన భాగ్యం

శరణాగత వత్సలివి..దీనజన బాంధవివి..

కోటి తీర్థ వర్థినివి..ముక్కంటి సృష్టి రూపానివి..

శివ శక్తుల కోలాటంతో..

శివమెత్తి సింహ గర్జన చేస్తూ..

కలి పాపాల నుండి మము రక్షింప

ఇల దిగి రావమ్మా!..

ఎర్రని తలుపుల వాకిట

మా కోర్కెల తలపులు పరిచినాము..

కొంగు బంగారమై నిలువ రావమ్మా! బంగరు మా పెద్దమ్మా!..

వినయ విధేయలతో..భక్తి శ్రద్ధలతో తొలి బోనమెత్తి

నీ ముంగిట నిలిచాము..

వరములొసగ వేగిరముగ రావమ్మా!

మనుషుల్లో పెరిగిన అహంకార మణచి

అజ్ఙానాంధకారాలను తొలగించ

చతుర్భుజ రూపిణివై వచ్చి

చేయూతనీయవే..మా పెద్ద మాంకాళమ్మా!!!

సుజాత.పి.వి.ఎల్., సైనిక్ పురి, సికిందరాబాద్

Related posts

రైతుకు ఇబ్బందులు ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

శ్రామిక నినాదం

Satyam NEWS

లోకేష్ ను చూస్తే జగన్ కు భయం

Satyam NEWS

Leave a Comment