39.2 C
Hyderabad
March 28, 2024 14: 48 PM
కవి ప్రపంచం

పూల పండుగ

#PattemVasantha

పుడమితల్లి పలకరించగా

పూల పండుగ వెల్లి విరియగా

తెలంగాణ ఆడపడుచులంతా

పుట్టింటికి వచ్చే ఆనంద హేళ

బిడ్డలకు వచ్చే బొడ్డెమ్మ పండుగ

బాలలకు వచ్చే బతుకమ్మ పండుగ

 పెత్ర మాస ఎంగిలిపూలతో  మొదలై

తొమ్మిది రోజులు తీరొక్క పూలతో

అడవి పూలు తెచ్చి అందంగా పేర్చి

 సత్తుపిండి  నైవేద్యాలు వాయినాలతో

ముత్తయిదువులంతా ఆడిపాడుతూ

ముద్ద పసుపు గౌరమ్మను మురిపెముగా

భక్తితో పూజించి పోయిరా గౌరమ్మ

పోయిరామ్మా వచ్చే ఏడాదికి మళ్లీ రావమ్మా

సకల సౌభాగ్యాలను ఇచ్చే తల్లి

తెలంగాణకే తలమానికమైన

తల్లి బతుకమ్మ చల్లగా దీవించవమ్మా..

‌‌పత్తెం వసంత, కరీంనగర్

Related posts

భాగ్యనగర భాగ్యశోభ

Satyam NEWS

బూజు

Satyam NEWS

అమ్మ ఆశీస్సులు

Satyam NEWS

Leave a Comment