32.2 C
Hyderabad
March 28, 2024 23: 20 PM
కవి ప్రపంచం

పూలజాతర

#Vasarachetla Jayanthi

పిల్లల కేరింతలతో

ఇల్లుఆనందడోలికలూగాలని…

ఆత్మీయత కరువైన గుమ్మానికి

నవ్వులతోరణాలు కట్టాలని….

ప్రతి ఇల్లూ నందనవనమై వెల్లివిరియాలని..

అడివమ్మను అడిగి చెట్టు చెట్టు తిరిగి

బుట్టనిండా తెచ్చుకున్న రంగులతో…

నవ్వులొలికించే తీరొక్క పూవులు!

ఒక్కొక్క రంగును చూస్తే

నాకళ్ళు అరమోడ్పులైయ్యాయి

మేనిఛాయలో ఒదిగిపోయే తంగేడులు

మంచుముద్దలు రాలినట్లు గునుగుపూలు

సందె కాంతిని తలపించే మందారాలు

రేరాజు రాకకై ఎదురు చూసే కలువబామలు

రంగురంగుపూలనూ వేరుచేసి వలయాలుగా పేర్చిన

నామునివేళ్ళను కుంచెగాచేసి మెరుగులు దిద్దిన

హరివిల్లు లాంటి బతుకమ్మలు

నాచేతిలో అపురూపంగా

ఒద్దికగా ఒదిగిపోయాయి!

ఆడపడచుల కాలిమువ్వల సవడులు

ఊరూవాడా కలిసి సయ్యాటలు

కోకిలమ్మలగానాలతో సందళ్ళు

ఉద్యమాలకు ఊపిరి పోసి

ఊరేగింపులలో తోడూనీడై

మాఅస్థిత్వాన్ని నిలిపింది బతుకమ్మ

తెలంగాణ తల్లిచేతిలో నిలిచి

సల్లగా బతుకుమని దీవించే

పెద్దముత్తైదువయ్యింది!

తీరొక్క పూలతో రోజుకోసద్దితో

తొమ్మిది రోజులపండుగ చేసి తృప్తి పరుస్తాము

మాఇండ్లల్లకొలువై

మాబతుకుల్లో రంగులు నింపే బతుకమ్మ!!

ప్రతియేటా వచ్చి పూలజాతరలో

మాపూజలందుకుని

ముత్తైదువులు గా ఉండాలని

మముదీవించవమ్మా గౌరమ్మా!!

జయంతి వాసరచెట్ల, 9985525355

Related posts

అల్పసంతోషి

Satyam NEWS

ఆషాఢ బోనాలు

Satyam NEWS

వీడ్కోలు

Satyam NEWS

Leave a Comment