37.2 C
Hyderabad
March 29, 2024 20: 54 PM
Slider కవి ప్రపంచం

మనిషి బతికేయాలంతే

#kondurikotibabu

బంధాలో అనుబంధాలో

సంసారమో బైరాగ్యమో

ఏపాటిదీ జీవితం

మనిషి బతికేయాలంతే…

తృప్తికి కొలమానముందా…

ఆశకు హద్దుందా…

సంపదలెన్ని కూర్చితేం…

కంటికింతకునుకులేనపుడు

బంగ్లాలో..నగలో..

బజారులో పలుకుబడో

ఎన్నికిరీటాలుంటేం

ఆప్తస్పర్ష లేని

ఆప్యాయపు బంధం లేనపుడు

నలుగురంటూ నలిగేకన్నా…

నీకోసం నాలుగునాళ్ళు.

పదుగురంటూ పరవంటూ…

గుండెకుపరదాలు ఎంతకాలం..?

ఎంతకాలం నీ మజిలీ..

ఎన్నితరాలను చూసిందీ మట్టి

మట్టిపై ప్రతిప్రాణీ…

మట్టిని చేరాల్సిందేగా…

మనసుకింత నిబ్బరం

వయసుకింత సంబురం

దేహానికింత దన్ను

మనిషి బతికేయాలంతే

ఏకాకిననుకుంటే ఎలా…?

గ్రహాలన్నీ ఒంటరివేగా…!

నిగ్రహం కావాలంతే..

కుంటిపక్షి కుమిలిందా..

గుడ్డిజీవి జడిసిందా…

ఎవరిక్కడ శాశ్వితం…

మనిషి బతికేయాలంతే

కొండూరి కోటిబాబు 9666233115

Related posts

రామిశెట్టి రామమూర్తినాయుడుకి గౌరవ డాక్టరేట్ !!

Satyam NEWS

ఏపీ నూతన సీఎస్ గా ఆదిత్యానాథ్ దాస్

Satyam NEWS

రిపబ్లిక్ టివి అర్నబ్ గోస్వామికి ధన్యవాదాలు

Satyam NEWS

Leave a Comment