ప్రజల పక్షాన గుంతెత్తే వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నేడు ఆమె ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఏసీబీ కేసులతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న పై రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఎలాంటి కేసులు పెట్టినా భయపడేదే లేదు. ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోంది. రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. 12 వేలకు తగ్గించి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారు. అందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు భయపడిన ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుంది. ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదు అని కవిత హెచ్చరించారు.
previous post