బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్. ప్రస్తుతం KBC11వ సీజన్ నడుస్తోంది. ఇందులో బీహార్ కు చెందిన సనోజ్ రాజ్ అనే యువకుడు మొదటి కోటీశ్వరుడిగా నిలిచాడు. సనోజ్ రాజ్ 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ. కోటి సొంతం చేసుకున్నాడు. 15వ ప్రశ్నకు ‘ఆస్క్ యాన్ ఎక్స్‌పర్ట్’ లైఫ్ లైన్‌ను వినియోగించుకుని కరెక్ట్ సమాధానం చెప్పాడు. ఆ తర్వాత ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగాడు. దాంతో ఈ సీజన్‌లో రూ. కోటి గెలుచుకున్న మొదటి అభ్యర్థిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సనోజ్. ప్రస్తుతం UPSC పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు సనోజ్.
previous post
next post