22.2 C
Hyderabad
December 10, 2024 11: 40 AM
Slider నిజామాబాద్

గురుశిష్యుల ఆలోచన ఇప్పటికీ ఒక్కటే

#KCR

జగన్, కేసీఆర్ లకు చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయి. ముఖ్యమంత్రులుగా పని చేసిన కాలంలో వీరి అహంకారానికి అడ్డే ఉండేది కాదు. అధికారం పోయిన తర్వాత కూడా ఇద్దరూ ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇద్దరూ గురుశిష్యులనే విధంగా అప్పుడు ఇప్పుడూ కూడా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ‌లో ఏడాది క్రితం జ‌రిగిన ఎన్నిక‌ల్లో కెసిఆర్ పార్టీ ఓట‌మి చెందింది. ఆయ‌న పార్టీ కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చి ఓడిపోయింది. స్వ‌యంగా కెసిఆర్ రెండుచోట్ల పోటీ చేస్తే ఒక‌చోట ఓట‌మి చెందారు.

అయితే..ఆయ‌న పార్టీ మాత్రం మంచి సీట్లే సాధించింది. అయితే కెసిఆర్ మాత్రం అసెంబ్లీకి రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న ఒక్క‌సారి కూడా అసెంబ్లీకి పోయిన దాఖలాలు లేవు. ఆయ‌న పార్టీ త‌రుపున ఉన్న ఎమ్మెల్యేలు, ఆయ‌న కుమారుడు, ఆయ‌న మేన‌ల్లుడు అసెంబ్లీలో గ‌ట్టిగానే పోరాడుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న‌కెసిఆర్ మాత్రం అసెంబ్లీలో అడుగుపెట్ట‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఆయ‌న అసెంబ్లీకి వ‌స్తే ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ముందు త‌ల‌దించుకోవాల్సి వ‌స్తుంద‌న్న భ‌య‌మే ఆయ‌న‌ను అసెంబ్లీకి రాకుండా చేస్తోంది.

గ‌తంలో అసెంబ్లీలో ముఖ్య‌మంత్రిగా కెసిఆర్ హావ‌భావాలు చూసిన వారు. ఇప్పుడు ఆయ‌న‌ను ఎమ్మెల్యేగా చూద్దామ‌ని ఆశ‌ప‌డుతున్నా ఆయ‌న మాత్రం..అసెంబ్లీ ముఖం చూడ‌డం లేదు. కాగా ఆయ‌న మిత్రుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిదీ అదే దోవ‌. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీ ఘోర ఓట‌మి చెంద‌డంతో క‌నీసం ప్ర‌తిప‌క్ష‌హోదా కూడా ద‌క్క‌లేదు. త‌న‌కు ప్ర‌తిప‌క్ష‌హోదా ఇస్తేనే అసెంబ్లీకి వ‌స్తాన‌ని ఆయ‌న ష‌ర‌తు పెడుతున్నారు. రూల్స్ ప్ర‌కారం అది జ‌ర‌గ‌దు…అయినా..ఆయ‌న త‌న‌కు ప్ర‌తిప‌క్ష‌హోదా ఇస్తేనే..అంటూ…ముఖ్య‌మంత్రికి త‌గ్గ‌కుండా మాట్లాడే అవ‌కాశం ఇవ్వాల‌ని ష‌ర‌తులు విధిస్తున్నారు.

తాను అసెంబ్లీకి వ‌స్తే మైక్ ఇవ్వ‌రంటూ ముందే ఏదేదో ఊహించుకుంటున్నారు. అసెంబ్లీకి వ‌స్తే టిడిపి, జ‌న‌సేన స‌భ్యులు గేలిచేస్తార‌నే భ‌యంతోనే ఆయ‌న అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. మొత్తం మీద‌..ఈ ఇద్ద‌రు మాజీ ముఖ్య‌మంత్రులూ ఒకే దారిలో న‌డుస్తున్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు అన్నాద‌మ్ముల్లా వ్య‌వ‌హ‌రించిన ఈ ఇద్ద‌రు నేత‌లు..ప్ర‌తిప‌క్షంలో కూడా అదే దారిలో న‌డుస్తున్నారు. ఇద్ద‌రి నేత‌ల్లో అన్ని విష‌యాల్లో సామీప్యం ఉన్నా…ఒక విష‌యంలో మాత్రం వైరుధ్యం ఉంది.

అదేమంటే..దోచుకున్న సొమ్ము పంచుకోవ‌డంలో…! తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి దోచుకున్న సొమ్మును త‌న ర‌క్త‌సంబంధీకుల‌కు స‌మానంగా పంచారు. ఈ విష‌యంలో.. ఆయ‌న త‌న‌వాళ్లంద‌రినీ..ఒకే ర‌కంగా చూశారు. అయితే..ఆంధ్రా మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మాత్రం ఆస్థి విష‌యంలో త‌ల్లీ,చెల్లీకి పంచ‌కుండా వారిపై కేసులు వేసి వేధిస్తున్నారు. దోచుకున్న సొమ్ములో త‌ల్లికి, చెల్లికి వాటా లేద‌ని, అంతా త‌న‌కే అంటూ కోర్టుకెక్కారు. అన్ని విష‌యాల్లో ఒకేదారిలోన‌డిచే కెసిఆర్‌, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిలు మాత్రం ఈ విష‌యంలో వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు.

Related posts

ఇంత అసమర్థ అధికారులు ఏ డివిజన్ లో ఉండరు

Satyam NEWS

చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

చివరి కార్తీక సోమవారం పికినిక్ స్పాట్లపై ఖాకీల నిఘా..!

Satyam NEWS

Leave a Comment