ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా చేపట్టబోతున్న జనతా కర్ఫ్యూను, తెలంగాణ వ్యాప్తంగా విధిగా ఎవరికివారు స్వచ్ఛందంగా పాటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
జనతా కర్ఫ్యూ కార్యక్రమం విజయవంతం చేయడానికి చేపట్ట వలసిన ఏర్పాట్లు, కార్యచరణ గురించి, జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ, తదితర ఉన్నతాధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.