36.2 C
Hyderabad
April 25, 2024 19: 23 PM
Slider హైదరాబాద్

కేసీఆర్ మోస‌కారి అంద‌రినీ మ‌భ్య‌పెట్టారు బీజేపీ

Laxman

కేసిఆర్ మోసకారి ఒక్కరిని వదలకుండా తెలంగాణ అందరినీ మోసం చేశార‌ని, దళితులకు మూడెకరాల భూమి అని, బీసీ కుల సంఘాలకు. డబుల్ బెడ్ రూమ్ ఆశపెట్టి ప్రజలను రుణ మాఫీ చేస్తామని రైతులను,కేంద్రం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయ‌ల‌దేని, తెలంగాణ ఉద్యమకారులను, విద్యార్థులను, జర్నలిస్టులను సైతం మోసం చేశార‌ని బీజేపీ నేత ల‌క్ష్మ‌ణ్ ఆరోపించారు. విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

నిరంత‌రం నిజాలు రాసే జర్నలిస్ట్ లను వేధిస్తూ కేసులు పెడుతున్నార‌న్నారు. వారంద‌రికీ బీజేపీ పార్టీ పూర్తి మ‌ద్ధ‌తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఫామ్ హౌస్ లో పడుకుంటే పాలన సాగద‌న్నారు. ప్రగతి భవన్ లో ఉంటే ప్రజలకు మేలు ఎలా జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, రేపు నాగార్జున సాగర్ ఎన్నికల్లో కూడా బీజేపీ విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.


తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపియేన‌ని అని ప్రజలు గుర్తించార‌ని సీఎం కేసీఆర్ అరాచ‌క పాల‌న‌ను అంత‌మొందించేందుకు పూనుకున్నార‌ని విమ‌ర్శించారు.


ఓ వైపు ప్ర‌జ‌లు కోవిడ్ తో ఇబ్బందులు ప‌డుతుంటే మ‌రోవైపు ఎల్ఆర్ఎస్‌తో ప్రజలను ప్రభుత్వం వేధిస్తోంద‌ని, దుబ్బాకలో క‌ర్రు కాల్చి వాత పెట్టినా వీరి ధోర‌ణి ఏ మాత్రం మారక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. తెరాస కొందరిది బిజెపి అందరిదీ అని అన్నారు. కుటుంబ పార్టీల ఆగడాలు ఇకపై సాగవ‌న్నారు.

బీజేపి కార్యకర్త కూడా అధ్యక్షులు అయ్యార‌ని గుర్తు చేశారు. మీ పార్టీలో కేటీఆర్, కవిత, హరీష్ రావులు కాకుండా కార్యకర్తను అధ్యక్షున్నిచేయ‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు, ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, ఉపాధ్యక్షులు యస్.రమేష్, నేషలిస్ట్ హబ్ చైర్మెన్ సాయి కృష్ణ, దేవిక సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అశోక్ రాష్ట్ర నాయకులు గండ్ర నరేందర్, సుదర్శన్, సిద్దాల రవి, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వరల్డ్ గ్రేటెస్ట్ బ్రాండ్ అండ్ లీడర్ గా శిద్దా సుధీర్

Satyam NEWS

ప్రాధాన్యత పనులపై ద్రుష్టి పెట్టాలి

Bhavani

నాటి వన్ టౌన్ ఎస్ఐ…నేడు డీఎస్పీ గా బాధ్యతలు…!

Satyam NEWS

Leave a Comment