37.2 C
Hyderabad
April 18, 2024 22: 38 PM
Slider నిజామాబాద్

కరోనా నియంత్రణలో కేసీఆర్ సర్కారు విఫలం

#BhattiVikramarka

కరోనా నియంత్రణలో కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజలు చచ్చినా బతికినా తమకు సంబంధం లేదన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మ్ హౌస్ కు వెళ్లడంపై ఉన్న దృష్టి కరోనాపై రివ్యూ చేయడంలో లేదని ఎద్దేవా చేశారు.

కరోనా వైరస్ ప్రభావం జిల్లాల్లో ఉన్న తీవ్రత, ప్రభుత్వ వైఫల్యాన్ని తెలుసుకోవడానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామారెడ్డి జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి ప్రత్యేక పీపీఈ కిట్ ధరించి జిల్లా ఆస్పత్రిని పరిశీలించారు.

పట్టిపీడిస్తున్న వైద్యుల కొరత

జిల్లాలో ఉన్న కోవిడ్ కేసుల వివరాలు, జిల్లా ఆస్పత్రిలో ఉన్న పడకలు, వైద్యుల వివరాలను ఆస్పత్రి సూపరిండెంట్ డా. అజయ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తో ఫోన్లో మాట్లాడి కోవిడ్ కేసులపై ఆరా తీశారు.

ఈ సందర్బంగా ఆస్పత్రిలో వైద్యుల కొరతను ఆస్పత్రి సూపరిండెంట్ అజయ్ కుమార్, ఆర్ఎంఓ శ్రీనివాస్ భట్టి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క  మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా తీవ్రతను పసిగట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు.

కరోనాపై ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టలేదని విమర్శించారు. పేరుకే కామారెడ్డి జిల్లా ఆస్పత్రి ఉందని, ఇందులో వసతులు లేవని, వైద్యుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. జిల్లాలో కరోనా కేసులపై అధికారులు తలా ఒక మాట్లాడుతున్నారన్నారు.

వైద్యుల పోస్టులను భర్తీ చేయడం లేదు

4270 కేసులని ఒకరు అంటే 3400 కేసులు ఉన్నాయని మరొకరు అంటున్నారని తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో 131 మంది వైద్యులకు 65 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇలా అయితే ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. జిల్లాలో 4270 కరోనా కేసులు ఉంటే ఇందులో 4 వేల మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని, వీరందరికి ప్రభుత్వ ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కరోనా వైద్యం కోసం 10 వేల కోట్లయినా ఖర్చు చేస్తామని చెప్పిన కేసీఆర్ వెయ్యి కోట్లు కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రోమ్ నగర చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఫార్మ్ హౌస్ లో పడుకుని సీఎం కేసీఆర్ సంగీతం వింటున్నారని ఎద్దేవా చేశారు.

ఈ నిర్లక్ష్య ధోరణిని ఎండగడతామని, ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని, తెలంగాణ ప్రజలారా ఇకనైనా మేలుకోండి అని పిలుపునిచ్చారు.

Related posts

సీఎం ప్రకటనపై అంబర్ పేట్ టీఅర్ఎస్ నాయకుల సంబరాలు

Satyam NEWS

సోమశిల జియో సెల్ సేవలకు అనుమతి కోరిన మల్లు రవి

Satyam NEWS

భక్తుల కోసం మేడారం లో స్టార్ మా తాత్కాలిక గృహాలు

Satyam NEWS

Leave a Comment