35.2 C
Hyderabad
April 20, 2024 18: 22 PM
Slider ప్రత్యేకం

అంబేద్కర్ ను పట్టించుకోని టీఆర్ఎస్, కాంగ్రెస్

#bandisainjai

సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే

ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు…తెలంగాణ రాష్ట్ర‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, బీజేపీ నేత సీహెచ్.విఠల్ సహా పలువురు నాయకులు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ….డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి తో ముందుకు వెళ్దామ‌న్నారు. అంబేద్కర్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని ప్ర‌దాని మోడీ ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఏనాడూ అంబేద్కర్ ను పట్టించుకోలేదని ఆరోప‌స్తూ….అంబేద్కర్ కి భారత రత్న ప్రకటించింది బీజేపీ ప్రభుత్వమేన‌ని స్ప‌ష్టం చేసారు రాబోయే తరాలకు స్ఫూర్తిగా ఉండాలంటూ అంబేద్కర్ పేరిట స్ఫూర్తి భవనాలు నిర్మించామ‌ని  బండి సంజ‌య్ స్ప‌ష్టం చేసారు.

ఏటా  ఏప్రిల్  14న‌ అంబేద్కర్ జయంతి వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను బీజేపీ నిర్వహిస్తోందన్నారు.ఈ క్ర‌మంలోనే అంబేద్కర్ వర్ధంతి, జయంతి వేడుకలు సీఎం  కేసీఆర్ కు గుర్తుకు రాక‌పోవడం దౌర్భాగ్య‌మ‌న్నారు.ఇక‌అంబేద్కర్ కు ఏనాడూ నివాళులు అర్పించని వ్యక్తి కేసీఆర్ అని విమ‌ర్శించారు.

సీఎం…. ఏమి పీకుతున్నారని అంత బిజీగా ఉన్నారు? …. ఫాంహౌస్ లో బిజీగా ఉన్నావా అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేసారు.రాజుకు తగ్గట్టు అధికారులు అలాగే వ్యవహరిస్తున్నార‌ని..అంబేద్కర్ వర్ధంతి,  జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేసి ఎందుకు నివాళులు అర్పించడం లేదో వాళ్లే సమాధానం చెప్పాలని బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు.

ఇక తెలంగాణ రాష్ట్రాన్ని దళిత ద్రోహి ఏలుతున్నాడు.. పేదల  పాలిట యముడిలా కేసీఆర్ తయార‌య్యార‌న్నారు. దళిత బంధు ఇస్తా అన్నావ్,  మూడెకరాల భూమి ఇస్తా అన్నావ్ అన్ని అబద్ధాలే…ఎన్నికల సమయంలో జై భీమ్ జై దళితులు అంటావ్… ఎన్నికల తరువాత దళితులను పట్టించుకోని  నాయకుడు కేసీఆర్ అని దుయ్య‌బ‌ట్టారు..బండి సంజ‌య్.అంత‌కుముందు కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, తరుణ్ చుగ్, సంజయ్ సమక్షంలో…..బీజేపీలో చేరారు… తెలంగాణ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక నేత సీహెచ్. విఠల్.

Related posts

అట్టహాసంగా సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం

Satyam NEWS

హుజురాబాద్ ఉప ఎన్నికలో బిజెపి గెలుపు ఖాయం

Satyam NEWS

ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ అనుచరులకు క్లీన్‌చిట్‌

Sub Editor

Leave a Comment