39.2 C
Hyderabad
April 23, 2024 18: 19 PM
Slider ఖమ్మం

 కార్మికులను మోసం చేస్తున్న కెసిఆర్

#CITU

బిజెపి అధికారంలోకి వచ్చాక కార్మిక, ఉద్యోగుల హక్కులు హరించే విధానాలు అవంలంబిస్తోందని సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు ఎం సాయిబాబా విమర్శించారు. ఖమ్మంలోని మంచికంటి భవనంలో సిఐటియు ఖమ్మం జిల్లా 11వ మహా సభ సంఘం జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ అధ్యక్షతన సభ జరిగింది. తొలుత సంఘం జెండాను సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ ఎగరవేశారు. అనంతరం మహాసభలో సాయిబాబా మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులను కాలు రాస్తుందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ రూ.15 వేల నుంచి రూ.16 వేలకు మించి ఇచ్చే పరిస్థితి లేదన్నారు. సుమారు మూడు లక్షల మంది కార్మికులకు రూ.11 వేలకు మించి వేతనం రావడం లేదన్నారు.

రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి 8 గడిచినా కార్మికులకు ఇచ్చిన ఏఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. ఆర్‌టిసి కార్మికుల హక్కులను 55 రోజులు సమ్మె చేసిన వారి సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు. టిఆర్ఎస్ అధికారులకు వస్తే కాంట్రాక్ట్ కార్మికులు పదం అనేది ఉండదని కెసిఆర్ పదేపదే చెప్పి కార్మికులను విస్మరించారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మరింత సంఘటిత ఉద్యమానికి కార్మికుల ఉద్యోగులు సిద్ధం కావాలని ఆ దిశగా ఖమ్మం జిల్లాలో గ్రామస్థాయి వరకు సిఐటియు విస్తరింప చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ మహాసభలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్, జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు ఎర్ర శ్రీకాంత్, పి రమ్య ,సిహెచ్ విఠల్ పి మోహన్ రావు, మూదాం శ్రీను, పి.రమ్య, కోటేశ్వరి, తిరుమల చారి, చంద్రశేఖర్, వై విక్రం తదితరులు పాల్గొన్నారు.

Related posts

మేడారం స్పెషల్: భక్తుల భద్రత మా బాధ్యత

Satyam NEWS

ఆర్టీసి ప్రయాణికులు కు గుడ్ న్యూస్

Bhavani

దిశ చ‌ట్టం…అదే ఫేక్ …అస్స‌లు “దిశ “చ‌ట్ట‌మే లేదు…!

Satyam NEWS

Leave a Comment