భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ ప్రతిపక్ష నేత హోదాలో నేడు తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు ఎన్నికల ఫలితాలు తర్వాత అనారోగ్యానికి గురికావడంతో గత రెండు సమావేశాలకు హాజరు కాలేదు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం కూడా విడిగా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు పదేపదే ప్రస్తావిస్తున్నారు ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనూ మొదటి రెండు రోజులు కేసీఆర్ సభకు హాజరు కాలేదు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా కూడా కెసిఆర్ సభకు రాకపోవడంతో రేవంత్ రెడ్డి ప్రస్తావించారుఅయితే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారని బారాస వర్గాలు చెబుతూ వస్తున్నాయి అందుకని కూడా నేడు బడ్జెట్ ప్రసంగానికి ఆయన హాజరు కానున్నారు.అటు తమ బాస్ సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చూడాలని బీఆర్ఎస్ అభిమానులూ వేచి చూస్తున్నారు. దీంతో ఇవాళ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగనున్నాయి
previous post
next post