26.7 C
Hyderabad
June 22, 2024 04: 30 AM
Slider ప్రత్యేకం

ఢిల్లీ మద్యం విధానం కేసు కేసీఆర్‌కు ముందే తెలుసు

#KCR

ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కాం గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్‌కు చెప్పారని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే తన టీమ్ సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిళ్లైలను కవిత తన తండ్రికి పరిచయం చేసినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. కవిత పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారని, ఆ తర్వాత బుచ్చిబాబు సమీర్ మహేంద్రను కేసీఆర్‌కు పరిచయం చేసినట్లు చెప్పారు. కవిత తన నాలుగు ఫోన్లలోని ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది. ఈ బెయిల్ పిటిషన్లపై ఈరోజు వాదనలు ముగియడంతో హైకోర్టు జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు.

Related posts

వత్తిడి ఉంది కానీ కండువా మార్చను

Satyam NEWS

ఏపిలో పెయిడ్ ఆర్టిస్టుల గందరగోళం

Satyam NEWS

ఈ సారి  కూడా”స్పందన” కు 33 ఫిర్యాదులు

Satyam NEWS

Leave a Comment