28.7 C
Hyderabad
April 20, 2024 09: 05 AM
Slider మహబూబ్ నగర్

ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కేసీఆర్:చిన్నారెడ్డి

#gchinnareddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని ప్రకటనలు, ఎన్ని హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో  లేరని,ప్రజల నమ్మకాన్ని కేసీఆర్  కోల్పోయారని ఏఐసిసి  కార్యదర్శి, మాజీ మంత్రి  చిన్నారెడ్డి  అన్నారు. బుధవారం కొల్లాపూర్ పట్టణ సమీపంలో ఈ నెల 13న జరిగే రేవంత్ రెడ్డి సభాస్థలిని నియోజకవర్గ  కాంగ్రెస్ నాయకులు రంగినేని  అభిలాష్ రావు, సీనియర్ నాయకులు రంగినేని జగదీశ్వర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ యాదవ్ తో కలిసి పరిశీలించారు.

అనంతరం ఆయన  అభిలాష్ రావు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 13న రేవంత్ రెడ్డి సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లా నుండి  అధిక సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నట్లు ఆయన తెలిపారు. వనపర్తి లో జరిగిన కేసీఆర్ సభ కన్న  రెండింతలు ప్రజలు ఎక్కువగా వస్తారని  తెలియజేశారు.మన ఊరు – మన పోరు సభ కు కదిలి రండి. కదలాడుతున్న సమస్యలు…. కదలలేని ప్రభుత్వాన్నికదిలిద్దాం… రా…!! తరలి రా….! అంటూ చిన్నారెడ్డి,అభిలాష్ రావు పిలుపునిచ్చారు. వేదిక : కొల్లాపూర్ పట్టణం మార్చి 13, సా.4గంటలకు ఉంటుందని చెప్పారు.

కేసీఆర్ చేసిన ప్రకటనపై చిన్నారెడ్డి వ్యాఖ్య

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన పై మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి స్పందించారు. ఇదివరకు కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి  చేస్తానని మోసం చేశాడు, డబుల్ బెడ్ రూములు ఇస్తానని మోసం చేశాడు, ఎన్నోసార్లు ఉద్యోగ ప్రకటన చేస్తానని మోసం చేశారు. ఇప్పుడు కేసీఆర్ ఎన్ని మాటలు, హామీలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు. అంతేకాదు గతంలో లక్ష తొంబై వేక ఉద్యోగాలు ఇస్తానని  ప్రకటన చేశారు.

మరి ఇప్పుడు 80వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానని చెప్పడం కరెక్ట్ కాదు అన్నారు.ఇచ్చిన మాట ప్రకారం కెసిఆర్ నిలబడాలి అన్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తానని మేనిఫెస్టోలో తెలిపారు.2018 ఎన్నికలు జరిగి, ప్రభుత్వం ఏర్పడి మూడున్నర ఏండ్లు అవుతుంది. ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.ఇలాంటి హామీలు కేసీఆర్ ఎన్నో ఇచ్చారు. ప్రజలను ఆశపెట్టారు మోసం చేశారు. అందుకే కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు. 8 ఏళ్ల తర్వాత 80 వేల పోస్ట్లు భర్తీ చేస్తామని ప్రకటించడం బాధాకరమన్నారు.

సోమశిల- సిద్దేశ్వరం వంతెనకు రాజశేఖర్ రెడ్డి శిలాఫలకం వేశారు

సోమశిల సిద్దేశ్వరం వంతెన రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోమశిల సిద్దేశ్వరం వంతెన శిలాఫలకం ప్రారంభించారు. ఇప్పుడు టిఆర్ఎస్, బీజేపీ మేము చేశామని చెప్పడం కరెక్ట్ కాదు అన్నారు.

రహదారి వస్తే రా వచ్చేమో కానీ సోమశిల- సిద్దేశ్వరం వంతెన రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు.నాలుగు విధాలుగా సాగునీరు అందే ప్రాజెక్టు కలిగిన ఏకైక ప్రాంతం కొల్లాపూర్ అన్నారు.కాంగ్రెస్ పార్టీకి కొల్లాపూర్ కంచుకోట అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదర్శన్ రెడ్డి, కొల్లాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మోజర్ల గోపాల్,బాబా, సంపంగి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Related posts

No money for terror : ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు ఆరంభం

Bhavani

పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు

Satyam NEWS

సమష్టి కృషితో సర్వతోముఖాభివృద్ధి: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

Satyam NEWS

Leave a Comment