27.7 C
Hyderabad
April 25, 2024 10: 59 AM
Slider నల్గొండ

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఇందిరా చౌక్ వద్ద కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం హుజుర్ నగర్  శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతు కష్టాలు తెలిసిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.

నియోజకవర్గ చరిత్రలో  ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. నిధుల కేటాయింపుకి సహకరించిన  జిల్లా మంత్రి జగదీష్ రెడ్డికి, కోదాడ శాసనసభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతు సమస్యలు తెలుసుకోని సీఎం కేసీఆర్ కి వివరించిన వెంటనే స్పందించి 1217.72 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన అపర భగీరధుడు కేసీఆర్ కు నియోజకవర్గ రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

విమర్శించే వారు విమర్శిస్తూనే ఉంటారని, వారికి అభివృద్ధి తోనే సమాధానం చెపుతానని, 540 సర్వే నెంబర్ భూముల విషయములో  గిరిజన రైతులకు న్యాయం జరిగేలా చేసే పార్టి కేవలం తెరాస పార్టీనే అని అన్నారు.

మఠంపల్లి 540 సర్వే నెంబర్ భూమిలో  అక్రమార్కులు ఎక్కడ బయటికి వస్తారో  అని రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని, భూములకు కాపలా ఉన్నది ఎవరు? భూములు ఆక్రమించింది ఎవరు? అధికారులను బెదిరించి, భయపెట్టి , భుములు వ్రాయించుకున్న  నాయుకులు వారి బాగోతాలు ఎక్కడ బయటకి వస్తాయో అన్న భయంతో తనపై అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.

నియోజకవర్గ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని, గతంలో చేసిన ఆరోపణలకు కాలమే సమాధానం చెప్పిందని, నేడు కూడా కాలమే సమాధానం చెప్తుందని అన్నారు.

నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న లిఫ్ట్ లు, కాలువల ఆధునీకరణ పనులకు నిధులు  కేటాయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఊరూరా బ్రహ్మరథం పడుతున్నారని,రైతులకు 24గంటల కరెంటు,రైతు భీమా,రైతు బంధు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైసీపీ కడప జడ్పీటీసీ చైర్మన్ కు జనసేన నాయకురాలి అభినందనలు…

Satyam NEWS

అధికార పార్టీ ఎంఎల్ఏ మాధవరంపై ఐటి దాడులు

Satyam NEWS

బిచ్కుందలో ఆర్డీవో పర్యటన

Sub Editor

Leave a Comment