27.7 C
Hyderabad
April 26, 2024 04: 15 AM
Slider తూర్పుగోదావరి

కేంద్రం జోక్యంతో మూతపడ్డ కేసీఆర్ నోరు

#somu veerraju

నదీ జలాల అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటికి తాళం పడిందని ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

నదీ జలాల్లో కేంద్రం జోక్యాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబునాడు ఇకనైనా తన పోకడలు మార్చుకోవాలని ఆయన అన్నారు.

కృష్ణా, గోదావరి జలాలపై కేంద్రం జారీ చేసిన గజెట్ తో కేసీఆర్ నోటికి తాళం పడిందని ఆయన వ్యాఖ్యానించారు.

రాజమండ్రిలో సోము వీర్రాజు మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారి విద్యలో 10 శాతం ఇ.బి.సి, 27 శాతం ఒ.బి.సి రిజర్వేషన్లు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

ఏపీ ఆర్థిక పరిస్థితిపై అన్ని ఆధారాలతో కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నామని చెప్పారు. ప్రకాశం జిల్లా రాచర్ల, త్రిపురాంతకంలో హిందూ దళిత, గిరిజనులపై దాడులు జరిగాయి.

గతంలో క్రైస్తవులు వారి ప్రార్థనలు వారు చేసుకునే వారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ మద్దతుతో క్రైస్తవులు తిరగబడుతున్న వైఖరిని బీజేపీ ఖండిస్తోంది అని పేర్కొన్నారు.

Related posts

వైభవంగా పెళ్లి చేసుకుంటే కటకటాలు గ్యారెంటీ

Satyam NEWS

పీఆర్ఓ కు స‌ర్టిఫికెట్ ఇచ్చిన ఎస్పీ రాజ‌కుమారీ..!

Satyam NEWS

కేంద్రంలో ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ సాధనకై 9న మహా ధర్నా

Bhavani

Leave a Comment