తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ముంచే పోలవరం ప్రాజెక్టు వద్దని ఆనాడు వ్యతిరేకించామని ఆయన తెలిపారు. ఇందిరా సాగర్ పేరుతో పోలవరం ప్రాజెక్టును ప్రతిపాదించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందని కూడా ఆరోపించారు. ఈ విషయం రికార్డుల్లో ఉందని, కావాలంటే చూసుకోవాలని విపక్షాలకు సూచించారు. కాగా, ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కేసీఆర్, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం సాగింది. దివాలా తీసిన ప్రభుత్వం తీరులో బడ్జెట్ ఉందని భట్టి విమర్శించగా, ఓవైపు ప్రాజెక్టులు పూర్తవుతున్నా చూడలేని కళ్లు ఉన్న కబోదుల్లా తయారయ్యారంటూ కేసీఆర్ విపక్ష నేతపై మండిపడ్డారు.
previous post
next post