తెలంగాణ వస్తే నాయకత్వ లోపం ఏర్పడుతుందని వాదించిన వారే ఇప్పుడు దేశంలో కూడా ఈ తరహా నాయకత్వం అవసరమని కోరుతున్నారని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన మీడియాతో కొద్ది సేపు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి అయ్యే విషయాన్ని ఆయన కొట్టిపారేశారు. ఇంకో పదేళ్లు సీఎం గా తానే ఉంటానని కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ..ఇంకా ఊహాగానాలు దేనికి ? అని ఎదురు ప్రశ్న వేశారు.
ప్రస్తుత సిఎం జగన్ తోనే కాదు చంద్రబాబు ఉన్నప్పుడు సత్సంబంధాలు కొనసాగాయి…మేము యాగం చేసినప్పుడు ఆయనను పిలిచాం..రాజధాని శంకుస్థాపన కు ఆయన పిలిచాడు..అని కేటీఆర్ అన్నారు. ఎన్ పి ఆర్,ఎన్ ఆర్సీ విషయంలో పార్టీ నిర్ణయం కంటే ప్రభుత్వ నిర్ణయమే ముఖ్యం..అందరి తో మాట్లాడి సీఎం ఓ నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎంఐఎం తో గతంలో కలసి పోటీ చేయలేదని, ఇప్పుడు పోటీ చేయం అని కేటీఆర్ స్పష్టం చేశారు. మిత్ర పక్షం అయినంత మాత్రాన కలిసి పొటీ చేయాలని లేదకదా అని ఆయన అన్నారు.