అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ రాజ్‌నివాస్‌లో లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌తో బుధవారం బేటీ అయ్యారు. 15 నిముషాల పాటు సాగిన సమావేశంలో ప్రమాణ స్వీకారమహోత్సవంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ నెల 16 న రాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణం చేయనున్న తరుణంలో కేజ్రీవాల్ ప్రస్తుత సీఎం పదవికి రాజీనామా సమర్పించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో ఆప్ శాసనసభా పక్ష నేతగా కేజ్రీవాల్ ఎన్నికయ్యారు.
previous post