30.2 C
Hyderabad
February 9, 2025 20: 18 PM
Slider జాతీయం

పూజారులకు కేజ్రీవాల్ అద్భుత ఆఫర్

#aravind

తమ పార్టీ ఢిల్లీలో తిరిగి ఎన్నికైతే ‘పూజారీ గ్రంథి సమ్మాన్ యోజన’ను ప్రారంభించనున్నట్లు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. హిందూ దేవాలయ పూజారులకు, గురుద్వారాలలోని వారికి నెలవారీ భత్యం రూ.18,000 మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. “ఈరోజు నేను ఒక పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తున్నాను. ఈ పథకం పేరు పూజారి గ్రంథి సమ్మాన్ యోజన. దీని కింద దేవాలయాల పూజారులు, గురుద్వారాలోని ‘గ్రంథి’లకు గౌరవ వేతనం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశాం. వారికి నెలకు దాదాపు రూ.18,000 గౌరవ వేతనం అందజేస్తాం అని ఢిల్లీ మాజీ సీఎం చెప్పారు.

తర్వలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వరుసగా నాలుగోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆప్ కోరుకుంటోంది. పూజారులు, గ్రంథిలు మన సమాజంలో ఒక ముఖ్యమైన భాగం, కానీ వారు తరచుగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. దేశంలోనే తొలిసారిగా, వారిని ఆదుకోవడానికి మేము ఒక పథకాన్ని ప్రవేశపెడుతున్నాము, దీని కింద వారికి నెలవారీ రూ. 18,000 భత్యం అందజేస్తాము, ”అని కేజ్రీవాల్ తెలిపారు. ఈ స్కీమ్ కోసం రిజిస్ట్రేషన్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. మంగళవారం కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ మందిర్‌ను సందర్శించి అక్కడ అర్చకుల నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తానని కూడా చెప్పారు.

Related posts

ప్రతిభ చూపిన విద్యార్ధులకు పోలీసుల సన్మానం

Satyam NEWS

ప్రజలు కట్టిన పన్నులతో జగన్ మత రాజకీయాలు

mamatha

పెద్ద సినిమాలకు మళ్లీ పొంచిఉన్న కరోనా గండం

Satyam NEWS

Leave a Comment