బాపట్ల జిల్లా ఎస్పీగా పని చేసిన వకుల్ జిందల్, విజయనగరం జల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజే తన కార్ డ్రైవర్ ను ఎస్. కోట బొడ్డవర చెక్ పోస్ట్ వద్దకు వెళ్లి అక్కడ సిబ్బందిని అలెర్ట్ చేసిన ఫలితంగా ఆరు నెలల తర్వాత అదే చెక్ పోస్ట్ వద్ద అరకు నుంచీ తరలిస్తున్న దాదాపు 118కేజీల గంజాయిని పట్టుకున్నారు ఎస్.ఓ.ట పోలీసులు, మొత్తం పట్టుకున్న గంజాయిని, అలాగే కేరళకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఎస్. కోట సీఐ మూర్తి.
కాగా స్వాధీనం చేసుకున్న గంజాయిని, కేరళకు చెందిన ఇద్దరు నిందితులను విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ డీపీఓలో కాన్ఫరెన్స్ హాలులో మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ మొన్న రామభద్రపురం, నిన్న బొబ్బిలి, తాజాగా ఎస్. కోట వద్ద గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని అన్నారు. గంజాయి అక్రమ రవాణకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాలో కొత్తగా అయిదు చెక్ పోస్ట్ లు పెట్టామని ఎస్పీ “సత్యం న్యూస్. నెట్” కి చెప్పారు.