33.2 C
Hyderabad
April 26, 2024 01: 09 AM
Slider జాతీయం

Kerala Assembly Polls: ఈ సంవత్సరానికి అతి పెద్ద జోక్ ఇది

#PetrolPrice

దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ ఏమిటంటే పెట్రోలు ధరల పెరుగుదల. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. సామాన్యుడు హాహాకారాలు చేస్తున్నా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

కనీసం సానుభూతి మాటలు కూడా మాట్లాడటం లేదు. ఎవడు ఎటుపోతే నాకేంటి అన్నట్టుగానే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. ఇది దేశ ప్రజల ఖర్మ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నది. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

అక్కడ బిజెపి పోటీ చేస్తున్నది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం కదా ఏం చేయాలి? పెట్రో ధరలపై హామీ ఇద్దాం అనుకున్నారు. వెనువెంటనే హామీ ఇచ్చేశారు.

కేరళలో తాము అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్ 60 రూపాయలకే విక్రయిస్తామని బీజేపీ గురువారం హామీ ఇచ్చింది.  పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి చేరుస్తామని సీనియర్ నేత కుమ్మనం రాజశేఖరన్ తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు కదా అందుకోసమే కేరళలో బిజెపి ఇలాంటి హామీలు ఇస్తున్నారు….. అనుకోవడంలో తప్పులేదు కదా? కేరళలో అధికారంలోకి వస్తే 60 రూపాయలకు పెట్రోలు ఇచ్చే పరిస్థితి ఉంటే మరి అదే సూత్రం దేశం మొత్తం అమలు చేయవచ్చు కదా?

రాష్ట్ర పన్నులు… కేంద్ర పన్నులు అంటూ కాకమ్మ కబుర్లు చెప్పే బదులు….

Related posts

పంజాబ్‌లో ఆప్ నాలుగో జాబితా విడుదల

Sub Editor

కార్యనిర్వాహక రాజధాని దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

Satyam NEWS

రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment