30.2 C
Hyderabad
February 9, 2025 20: 34 PM
Slider జాతీయం

కె-ఫోన్ ప్లాన్: మొదటి దశలో పది వేల కనెక్షన్లు ఫ్రీ

kerala fiber

హైస్పీడ్ ఇంటర్ నెట్ కోసం ఏర్పాటు చేస్తున్న కె-ఫోన్ (కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్) ప్రాజెక్టులో భాగంగా, మూడు నెలల్లో 10,000 ఉచిత కనెక్షన్లు అందించేందుకు రంగం సిద్ధమైంది. కోర్ నెట్‌వర్క్ జిల్లాలను కలిపే చోట ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులకు ముందుగా ఈ ఫ్రీ కనెక్షన్లు ఇస్తారు.

ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటుతో, 30,000 ప్రభుత్వ కార్యాలయాలతో సహా హై-స్పీడ్ ఇంటర్నెట్ కవర్ చేస్తారు. 20 లక్షలకు పైగా బిపిఎల్ కుటుంబాలకు సరసమైన ధరలకు ఉచిత ఇంటర్నెట్, మరికొన్ని ఇంటర్ నెట్ సేవలను అందించనున్నారు. ప్రస్తుతం పైలట్ కేబులింగ్ తిరువనంతపురం, చెరుతిప్పర సబ్‌స్టేషన్ నుండి ప్రభుత్వ ఐటి పార్క్ లిమిటెడ్ కు చెందిన టెక్నో పార్క్ కార్యాలయాలకు జరుగుతున్నది.

కేబుల్ KSEB హై-డెఫినిషన్ ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా వెళుతుంది. ఈ మార్గాల్లో కార్యాలయాలు, ఇళ్లు ఇంటర్ నెట్ ను ఉచితంగా వాడుకోవచ్చు. అక్కడి నుండి ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్లకు కనెక్షన్లు ఇస్తారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సదుపాయాన్ని పౌర హక్కుగా చేర్చబోతున్నది. KSEB, IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టు అమలు చేస్తారు.

Related posts

మాలాధారణ చేసిన ప్రతి వ్యక్తిలో అయ్యప్ప ఉంటాడు

Satyam NEWS

భువ‌నేశ్వ‌ర్‌ శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా జ‌లాధివాసం

Satyam NEWS

ఇంటింటి ఫీవర్ సర్వే పకడ్బందీగా చేపట్టాలి

Satyam NEWS

Leave a Comment