27.7 C
Hyderabad
April 20, 2024 02: 15 AM
Slider శ్రీకాకుళం

కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాల అధ్యాపకుల ఆకలికేకలు

kasturiba college

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 32 కేజీబీవీ పాఠశాల ఉండగా గత ఏడాది జి.సిగడాం, కోటబొమ్మాలి కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను ప్రయోగాత్మకంగా  ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మరో 20 కి పైగా కేజీబీవీ పాఠశాలలను కాలేజీ గా మార్పులు చేశారు. ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నేటి వరకు సైన్సు ప్రయోగశాల లు విద్యార్థులకు సంబంధించిన, ప్రాక్టికల్ రికార్డులు, విద్యార్థులకు కూర్చోవడానికి క్లాసు రూముల్లో సరిపడా  బెంచీలు , వీరికి సంబంధించిన లైబ్రరీ పుస్తకాలు లేవు. సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర అధికారులు నేటి వరకు ఈ కేజీబీవీ కళాశాలకు రాలేదు. ఈ కేజీబీవీ పాఠశాలలో నేటికి లెక్కలు, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు లెక్చరర్ పోస్టులు  ఖాళీగా ఉన్నాయి. దీని వలన ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలకు చాలా అసౌకర్యంగా ఉంది. మరో  రెండు నెలల్లో ప్రాక్టికల్స్, మరో మూడు నెలల్లో అంటే మార్చి లో ముఖ్యమైన పరీక్షలు జరగబోతున్నాయి. పార్ట్ టైం లెక్చరర్లు ఎంతో కష్టపడి తమ సిలబస్ పూర్తి చేయటానికి అహర్నిశలూ కష్టపడుతున్నారు కానీ వీరికి గత మూడు నుంచి నాలుగు నెలల వరకు జీతాలు రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వీరి సమస్యలను ఏ అధికారులకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వేదనలో పడిపోయారు. ఇప్పటికైనా జిల్లా అభియాన్ అధికారులు, జిల్లా సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్టు చైర్మన్ కలెక్టర్ జె నివాస్ ఈ కేజీబీవీ లపై దృష్టి సారించి పార్ట్ టైమ్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలి.

Related posts

నీ చావు నువ్వు చావు నేను మాత్రం సేఫ్

Satyam NEWS

ఎనదర్ బ్లో: ఏపి ప్రభుత్వంపై మరో కోర్టు ధిక్కార నేరం?

Satyam NEWS

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

Bhavani

Leave a Comment