28.7 C
Hyderabad
April 25, 2024 06: 58 AM
Slider ప్రత్యేకం

కేజీబీవీలో మెరిసిన ఆణిముత్యాలు: సత్తాచాటిన అనాధ బాలికలు

#interstudents

ఇంటర్ మొదటి సంవత్సరం 87%, ఇంటర్ రెండో సంవత్సరం 90% శాతం ఉత్తీర్ణత

ప్రయివేటు కళాశాలల విద్యార్థులే కాదు. తమకు ప్రోత్సహం ఉంటే చాలు ఏదైనా సాధిస్తామంటూ అనాధ, బడిబయట, డ్రాప్‌ అవుట్స్‌ పిల్లలు ఇంటర్మీడియట్లో తమ సత్తా ఏమిటో కేజీబీవీలు నిరూపించారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ప్రయివేటు కళాశాలల విద్యార్థులకు ధీటుగా ఫలితాలు సాధించారు.  

గతంలో ఎన్నడూ లేనివిధంగా 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మూడోస్థానం దక్కింది. జిల్లాలో కేజీబీవీ విద్యార్థినులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 87%, రెండో సంవత్సరం 90% శాతం ఉత్తీర్ణత సాధించారు.

వ్యక్తిగత మార్కుల్లో ప్రతిభ చూపారు. కొల్లాపూర్, కేజీబీవీ లో ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470/461 మార్కులు సాధించిన బి జ్యోతి, వెల్దండ కేజీబీవీ బైపీసీలో 440/425 మార్కులు సాధించిన కే భూమిక, తెలకపల్లి కేజీబీవీలో ఎం పి హెచ్ డబ్ల్యులో 500/485 మార్కులు సాధించిన జి గాయత్రి, బిజినపల్లి కేజీబీవీలో సీఈసిలో 500/475 మార్కులు సాధించిన ఎం కవిత, రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ లో వెల్దండ కేజీబీవీ ఎంపీసీ లో 1000/951 మార్కులు సాధించిన ఆర్ అఖిల, నాగనూల్ కేజీబీవీలో బైపిసిలో 1000/951 జి స్వాతి, తెలకపల్లి కేజీబీవీ ఎం పి హెచ్ డబ్ల్యులో 1000/930 మార్కులు సాధించిన జి శ్వేత, తెలకపల్లి కేజీబీవీలో సీఈసీలో 1000/859 మార్కులు సాధించిన మనీషా వ్యక్తిగత మార్కుల్లో అమ్మాయిలు ప్రతిభ చాటారు.

జిల్లా వ్యాప్తంగా 9 కస్తూర్భాగాంధీ ఇంటర్మీడియట్ బాలికల పాఠశాలలున్నాయి. నాగర్ కర్నూల్, బిజినపల్లి, తెలకపల్లి, అమ్రాబాద్, బల్మూర్, కొల్లాపూర్, లింగాల్, పెంట్లవెల్లి, వెల్దండ  మండలాల్లో ఇంటర్మీడియట్ కేజీబీవీలున్నాయి. ఇందులో బాలిక విద్యను అభివృద్ధి చేసేందుకు గురుకుల పాఠశాలల పోటీగా విద్యలో కొనసాగి స్తున్నది.

6-18 ఏండ్ల వయస్సు కల్గిన బాలికలకు సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో కేజీబీవీలు పని చేస్తున్నాయి. వీటిలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్  వరకు విద్యను అందిస్తున్నారు. ఇందులో అన్ని ఉచితంగానే ప్రభుత్వం అందిస్తున్నది.

ఈ పాఠశాలల్లో ప్రధానంగా తల్లిదండ్రులు లేని బాలికలు, తల్లి లేదా తండ్రి లేని పిల్లలు, నిరుపేదల పిల్లలు, డ్రాప్‌అవుట్‌, బడియట పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. అలాగే కొంతమంది నిరుపేదలై ఉండి రెగ్యులర్‌ పిల్లలు కూడా ఉన్నారు.

బాలికల విద్యకు సంపూర్ణ కృషి

వారికి ప్రత్యేక విద్యాభివృద్ధిని అందించాలనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. బాలికలకు సంపూర్ణ విద్యను అందించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నది. 9 కేజీబీవీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 454 మంది విద్యార్థులకు గాను 396 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరంలో 380 మంది విద్యార్థినిల గాను 341 బాలికలు ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్ మొదటి సంవత్సరంలో 87% రెండో సంవత్సరంలో 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో అమ్రాబాద్ బల్మూర్ లింగాల్ కేజీబీవీ లు 100% ఉత్తీర్ణత సాధించాయి. ద్వితీయ సంవత్సరం లో అమ్రాబాద్ బల్మూర్ బిజినపల్లి కేజీబీవీ లో 100% ఉత్తీర్ణత సాధించాయి.

వ్యక్తిగత మార్కులు లోనూ టాప్‌ గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రయివేటు కళాశాలలకు ధీటుగా కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల్లో ఇంటర్ ఫలితాల్లో విద్యార్థినులు టాప్‌లేపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అమ్రాబాద్ కేజీబీవీ విద్యార్థినిలు వారి ప్రతిభ ఎలా ఉందో అర్థమవుతోంది. రాష్ట్రంలో కందనూలు జిల్లాకు మూడోస్థానం కేజీబీవీల్లో విద్యనభ్యసిస్తున్న బాలికల ఫలితాలను పరిశీలిస్తే.. కందనూలు కు రాష్ట్రంలో మూడోస్థానం దక్కింది.  

ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరుగడమే కాకుండా వ్యక్తిగత మార్కుల్లోనూ బాలికలు సత్తాచాటారు. 4 కేజీబీవీల్లో వందశాతం ఉత్తీర్ణులయ్యారు. 90% పైగా  ఫలితాలు సాధించిన కేజీబీవీలు మరో 4 ఉన్నాయి. విద్యార్థినిలపై ప్రత్యేక శ్రద్ధ

 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్, పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, కేజీబీవీల పర్యవేక్షణాధికారిణి సూర్య చైతన్య లు ఓ ప్రణాళిక రూపొందించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆ విద్యాలయాల బోధకులకు సూచించారు.

ప్రతి విద్యాలయంలో 4 నుంచి 8 మంది పిల్లల వరకు విద్యార్థుల సంఖ్యను బట్టి గ్రూపులు తయారు చేశారు. ఆయా గ్రూపుల్లోని విద్యార్థులు ఏయే సబ్జె క్టుల్లో ముందుంజలోనూ, వెనుకబడి ఉన్నారో గుర్తించాలని సూచించారు. ఆయా సబ్జెక్టుల్లో ప్రత్యేకంగా తరగ తులు నిర్వహించి వారిని ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేశారు.

ఎప్పటికప్పుడు  టెస్టులు పెట్టి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్ర ద్ధ పెట్టారు. ఎస్‌ఓల పర్యవేక్షణలో పాఠశాలలు కొనసాగుతున్నాయి.  విద్యార్థినిల పట్ల తీసుకున్న ప్రత్యేక శ్రద్ధపై ఎస్‌ఓలు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. ఇందు కు జిల్లా కలెక్టర్‌ ఉదయ్ కుమార్ సహకారం, డీఈవో గోవిందరాజులు, కేజీబీవీల పర్యవేక్షణాధికారి సూర్యచైతన్యల ప్రోత్సాహం తోడుకావడంతో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులు ఈ సారి ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ సత్తాచాటారు.

ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు

కేజీబీవీల్లో ఇదులో 97  మంది మాత్రమే ఫెయిలయ్యారు. ఇందులో  పెంట్లవెల్లి, కొల్లాపూర్ కేజీబీవీలలో ఫెయిలైన వారే అధికంగా ఉన్నారు. 97 మంది విద్యార్థులు అడ్వాన్స్‌ సప్లిమెంట రీలో ఉత్తీర్ణులయ్యేందుకు  ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని డీఈవో ప్రకటించారు.

ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌నెంబర్స్‌ను తీసుకుని వారిని పిలిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నైపుణ్యం కగిలిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఈ శిక్షణా శిబిరానికి పంపనున్నారు. అడ్వాన్స్‌ సప్లిమెంటరీలో మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామని డిఈఓ తెలిపారు.

100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పెట్టుకున్నామని కేజీబీవీల్లో విద్యార్థినిలు మంచి ఫలితాలు సాధించేందుకు ఈసారి ప్రారంభం నుంచే ప్రత్యేకంగా కృషి చేశాం. విద్యార్థినుల బలాలు, బలహీనతలు గుర్తించి,  ప్రతి కేజీబీవీలో ఎస్‌ఓ పూర్తిస్థాయి లో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాం. ఈ సారి మంచి ఫలితాలు సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు కలెక్టర్,డిఈఓ, పర్యవేక్షణాధికారి, అభినందనలు తెలిపారు.

Related posts

ప్రియుడి మోజులో పిల్లల్ని, తల్లిని వదిలించుకున్న మహిళ

Satyam NEWS

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS

చర్లపల్లి డివిజన్ మధుర నగర్ లో jio సెల్ టవర్ ఎత్తివేయాలి

Satyam NEWS

Leave a Comment