28.2 C
Hyderabad
April 20, 2024 13: 01 PM
Slider ప్రత్యేకం

డిజాస్టర్: విషవాయువుతో పసి పిల్లలు విలవిల

#KGH Kids

విశాఖపట్నం నగరంలోని గోపాలపట్నంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో భారీగా గ్యాస్‌ లీక్‌ అయిన సంఘటనలో అస్వస్థతకు గురైన పిల్లలను చూస్తూ గుండె తర్కుపోతున్నది. ఇప్పటికి మొత్తం ఎనిమిది మంది మరణించినట్లు సమాచారం ఉంది. కాగా ఆసుపత్రి మొత్తం పిల్లలతో నిండిపోయి ఉంది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.

అంబులెన్స్‌లు, వ్యాన్లు, కార్లలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరోవైపు వెంకటాపురంలో పశువులు మృత్యువాత పడ్డాయి. పాలిమర్స్ చుట్టూ ఉన్న చెట్లు మాడిపోయాయి. మరోవైపు సహాయక చర్యలు అందించడానికి వచ్చిన పలువురు పోలీసులు కూడా అస్వస్థత గురవ్వగా..వారిని కూడా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

 అంతేకాదు.. ఘటనను పరిశీలించడానికి వచ్చిన డీసీపీ ఉదయ్‌భాస్కర్‌ కూడా అస్వస్థతకు గురయ్యారు. మరో రెండు గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మీడియాకు వెల్లడించారు.

Related posts

చిత్ర పరిశ్రమకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న మహత్తర అవకాశం

Satyam NEWS

నేషనల్ ఇన్స్పైర్ పోటీలకు ములుగు నుంచి ఒక ప్రాజెక్టు ఎంపిక

Satyam NEWS

విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో అన్నదానం

Satyam NEWS

Leave a Comment