28.7 C
Hyderabad
April 24, 2024 06: 25 AM
Slider ఖమ్మం

సామజిక సేవలోనూ ముందున్న ఖమ్మం పోలీసులు

#blooddonation

శాంతిభద్రతలు, ప్రజారక్షణతో పాటు సామజిక సేవలో పోలీసులు ముందుండి ప్రజాదరణ పొందుతున్నారని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ అవరణలో తలసేమియా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానమని, రక్తదానంపై ప్రజలు అవగాహన పెంచుకొని స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

తలసేమియా వ్యాధిగ్రస్తులకు పోలీసులు ,ఆటోడ్రైవర్లు, విద్యార్థులు, పలువురు యువతి, యువకులు స్వ చ్ఛందంగా ముందుకు వచ్చి106 మంది రక్తదానం చేశారని అన్నారు. ఈ రక్తదానంతో అత్యవసర పరిస్థితిలోని రోగికి, ప్రమాద ఘటనల్లో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందించడం ద్వారా వారి ప్రాణాలు కాపాడాలన్నారు.

పోలీస్ కమ్యూనికేషన్స్ పై అవగాహన పోలీస్ శాఖలో పోలీస్ వైర్‌లెస్ కమ్యూనికేషన్స్ పనితీరు, టెక్నాలజీ వినియోగంపై ప్రజలలో అవగాహన పెంపొందించడానికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్  ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీపీ ఇంజరాపు పూజ, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్ , ఏసీపీ రామోజీ రమేష్ , అంజనేయులు, ప్రసన్న కుమార్ , AR ACP విజయబాబు, సిఐ అంజలి, చిట్టిబాబు , కమ్యూనికేషన్స్ సిఐ కృపానీరజా పాల్గొన్నారు.

Related posts

రాజమండ్రిలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు

Bhavani

సూర్యుడు ఉన్నంతకాలం హిందూ ధర్మం ఉంటుంది

Satyam NEWS

టికెట్ కేటాయింపులో షబ్బీర్ అలీ హోదా ఏంటి..?

Satyam NEWS

Leave a Comment